Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్ : గుజరాత్‌ సీఎం రాజీనామా

By:  Tupaki Desk   |   11 Sep 2021 10:03 AM GMT
బిగ్ బ్రేకింగ్ : గుజరాత్‌ సీఎం రాజీనామా
X
ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం అయ్యిన గుజరాత్‌లో ఐదేళ్లుగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. గాంధీనగర్‌ లో జరిగిన పార్టీ కీలక సమావేశం తర్వాత గుజరాత్‌ లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాజీనామా చేశారు. తన రాజీనామా సమర్పించిన తరువాత, రూపానీ విలేకరులతో మాట్లాడుతూ తనకు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అతను తన ఆకస్మిక రాజీనామా వెనుక గల కారణాల గురించి ప్రశ్నలకి మాత్రం సమాధానం చెప్పలేదు.

తాను ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశానని, అది చాలా కాలం అని , బీజేపీలో మార్పు అనేది సహజమైనన్న రూపానీ వెల్లడించారు . తాను బీజేపీ జాతీయ అధ్యక్షుడి నాయకత్వంలో పని చేస్తూనే ఉంటానని ,గత ఐదేళ్ల కాలంలో ప్రజలు బీజేపీ పై తమ విశ్వాసాన్ని పదేపదే నిలబెట్టుకున్నారని ఆయన అన్నారు. ఇటీవలి వారాల్లో రాజీనామా చేసిన మూడో బీజేపీ సీఎం రూపానీ. గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేవ‌లం ఏడాది గ‌డువు ఉండ‌గా ముందస్తుగా విజ‌య్ రూపానీ రాజీనామా చేయ‌డం ఇప్పుడు హాట్‌ టాఫిక్‌ గా మారింది. బీజేపీ కొత్త ముఖ్యమంత్రి నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. విజ‌య్ రూపానీ ఆరోగ్య ప‌రిస్థితి స‌రిగా లేక‌పోవ‌డం లాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న స్థానంలో కొత్త సీఎంని నియ‌మించి, అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నేది బీజేపీ వ్యుహంగా రాజకీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.