Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి

By:  Tupaki Desk   |   9 Sep 2022 9:30 AM GMT
బిగ్ బ్రేకింగ్: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి
X
కాంగ్రెస్ కు మును‘గోడు’ తప్పింది. ఇన్నాళ్లు తన్నుకుచచ్చిన కాంగ్రెస్ వాళ్లు అంతా ఇకనైనా సర్దుకుంటారేమోనని కాంగ్రెస్ శ్రేణులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ తరుఫున మునుగోడు అభ్యర్థి ఎవరో తేలిపోయింది. మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎట్టకేలకు ఖరారు చేసింది.

ఇన్నాళ్లు అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో తెలియక అయోమయానికి గురవుతున్న కేడర్ కు ఏఐసీసీ స్పష్టత ఇచ్చింది. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించింది. మునుగోడు అభ్యర్థి విషయంలో టీపీసీసీ నేతలు నలుగురి పేర్లతో ఏఐసీసీ నివేదిక పంపినట్లు తెలుస్తోంది.

అయితే అన్ని కోణాలను పరిశీలించిన ఢిల్లీ పెద్దలు పాల్వాయి స్రవంతి వైపే మొగ్గు చూపించినట్లు సమాచారం. మునుగోడులో ఆమెకు మంచి పేరు ఉండడం కలిసి వచ్చింది.

టీపీసీసీ పెద్దలు నలుగురు అభ్యర్థుల జాబితాను ఢిల్లీకి పంపించింది. అందులో పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి, కైలాష్ నేత, పల్లె రవి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో కాంగ్రెస్ అధిష్టానం పాల్వాయి స్రవంతి వైపే మొగ్గు చూపింది.మునుగోడులో మంచి పేరు ప్రతిష్టలు ఉండడం కూడా కలిసివచ్చింది.

మునుగోడు కాంగ్రెస్ టికెట్ కోసం స్రవంతి, కృష్ణారెడ్డి మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. టికెట్ తమకే దక్కుతుందని ఇరువురు నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థి ఎంపిక కోసం ఏఐసీసీ ఓ కమిటీ నియమించింది. అభిప్రాయసేకరణ చేశాక పాల్వాయి స్రవంతికే అవకాశమిచ్చారు.

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే, ఎంపీగా చేసిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తెగా స్రవంతి మునుగోడు ప్రజలకు సుపరిచితురాలు. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీచేసిన స్రవంతి ఆ ఎన్నికల్లో 27441 ఓట్లు సాధించి రెండో స్తానంలో నిలిచారు. 2018లో మునుగోడు కాంగ్రెస్ టికెట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడంతో స్రవంతి తప్పుకున్నారు. ఆ విధేయతనే ఇప్పుడు ఆమెకు కలిసి వచ్చింది. సీటు దక్కింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.