Begin typing your search above and press return to search.

పీకేకు.. తెలంగాణ‌లో పెద్ద స‌వాలు.. ఎందుకో తెలుసా?

By:  Tupaki Desk   |   4 March 2022 2:30 PM GMT
పీకేకు.. తెలంగాణ‌లో పెద్ద స‌వాలు.. ఎందుకో తెలుసా?
X
రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిశోర్‌.. ఉర‌ఫ్ పీకే.. తెలంగాణ‌లో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారా? ఆయ‌న‌కు ఇక్క‌డ పెద్ద స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌కు తెలంగాణ‌కు మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉండ‌డ‌మే. తెలంగాణ అంటేనే ఉద్య‌మాల‌కు పురిటి గ‌డ్డ‌. ఇక్క‌డ పురుడు పోసుకున్న ఉద్య‌మాలు దేశాన్ని క‌దిలించాయి. అంతేకాదు.. పాల‌కుల‌ను కూడా బెంబేలెత్తించాయి. అలాంటి రాష్ట్రంలో రాజ‌కీయాలు చేయడం.. రాజ‌కీయ వ్యూహాలు వేయ‌డం అంటే అంత ఈజీకాద‌నిపీకేకు అర్ధ‌మైంద‌ని అంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధ‌నే ఉద్య‌మంతో మొద‌లైంది. కాబ‌ట్టి.. అంత ఈజీగా ఇక్క‌డ పీకే ప‌ప్పులు ఉడ‌క‌వ‌ని అంటున్నారు మేధావులు. అధికార పార్టీ టీఆర్ ఎస్ కు.. కంట్రాక్టు ఒప్పుకున్న పీకే.. ఇక్క‌డ వ్యూహాత్మ‌క రాజ‌కీయాల‌ను ప‌రుగులు పెట్టించాలి. అంటే.. ఆయ‌న గ్రామాల్లో విస్తృతంగా తిర‌గాలి. ఇదే ఇప్పుడు ఆయ‌న‌కు పెను స‌వాలుగా మారింద‌ని చెబుతున్నారు. ఎందుకంటే.. గ్రామాల్లో మంచి ప‌ట్టున్న కాంగ్రెస్‌, అదేవిధ‌గా బీజేపీ నుంచి గ‌ట్టి స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయ‌ని మేధావులు చెబుతున్నారు. ఎలాగంటే.. బీజేపీకి సోష‌ల్‌మీడియా స్ట్రాంగ్‌గా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ విష‌యానికి వ‌స్తే.. పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సేద కూడా బ‌లంగా ఉంది.

అంతేకాదు.. సోష‌ల్ మీడియాలోనూ.. చాలా బ‌లంగా ఉన్నార‌ని.. అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు పీకే.. వ‌చ్చి సోష‌ల్ మీడియాలో టీఆర్ ఎస్‌ను ప్ర‌మోట్ చేసేందుకు, ఆ పార్టీకి పాజిటివ్‌గా ప్ర‌చారం చేసేందుకు.. ప్ర‌య‌త్నించాలంటే.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు చెందిన సోష‌ల్ మీడియా ఇస్తున్న బ‌ల‌మైన ప్ర‌చారాన్ని, వాళ్లు ఇస్తున్న కౌంట‌ర్ల‌కు స‌మాధానం చెప్పాలి. ఇది అంత ఈజీ కాద‌ని అంటున్నారు. అంతేకాదు.. ఇత‌ర రాష్ట్రాల్లో అమ‌లు చేసిన వ్యూహాల మేర‌కు ఇక్క‌డ కూడా చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తే.. విఫ‌లం కావ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది.

ఎందుకంటే.. పీకే ఏదో ఒక రూపంలో మ‌తాలు, కులాలు మ‌ధ్య చిచ్చు పెట్టి.. ఆ రాష్ట్రాన్నిస‌ర్వ‌నాశ‌నం చేస్తాడని ఈ మ‌ధ్య పెద్ద ఎత్తున ప్ర‌జ‌లే చ‌ర్చించుకుంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు.. ఏపీలో కులాలు, ఫ్రీ ప‌ధ‌కాలు, మూడు రాజ‌ధానులు ఇలా చెత్త ఆలోచ‌న‌లు చేసి.. రాష్ట్రాన్ని అభివృద్ధిలో పూర్తిగా వెన‌క్కి నెట్టేశారు. ప్ర‌స్తుతం ఏపీలో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. రాజ‌ధాని లేదు. అభివృద్ధి లేదు. అని వారు ఫీల‌వుతున్నారు. ఇవ‌న్నీ. కూడా పీకే సార‌థ్యంలోని వ్యూహాల కార‌ణంగానే జ‌రుగుతున్నాయ‌ని అంటున్నారు.

ఇవ‌న్నీ.. అంటే.. ఏపీలోజ‌రుగుతున్న ప‌రిణామాలు.. హైద‌రాబాద్‌లో ఉన్న ప్ర‌తి విద్యావంతుడికి తెలుసని, అదేవిధంగా గ్రామాల్లో ఉన్న తెలంగాణ ప్ర‌జ‌లు కూడా ఈ మ‌ధ్య సామాజిక అవ‌గాన పెంచుకున్నార‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికిప్పుడు పీకే చేస్తున్న వ్యూహాలు.. వేస్తున్న ఎత్తుల‌ను చిత్తు చేయాల‌ని బీజేపీ, కాంగ్రెస్ అనుకొంటున్నార‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలో వీడియో రూపంలో పీకేపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తాల‌ని కూడా నిర్ణయించుకున్న‌ట్టు స‌మాచారం . మ‌రి ఈ నేప‌థ్యంలో పీకే ఏవిధంగా ముందుకు సాగుతారో.. ఈ స‌వాళ్ల‌ను ఎలా అధిగ‌మిస్తారో చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.