Begin typing your search above and press return to search.

కుప్పంలో గెలిచేదెవరు... ?

By:  Tupaki Desk   |   30 Oct 2021 1:30 PM GMT
కుప్పంలో గెలిచేదెవరు... ?
X
కుప్పం. ఇపుడు ఏపీలో హాట్ ఫేవరేట్ సీటు. దీని గురించి ఎవరికీ తెలియకుండా ఇన్నాళ్ళూ చంద్రబాబు కంటికి రెప్పలా చూసుకున్నారు. పేరుకు ఏపీలో ఉన్నట్లుగా ఉన్నా ఎక్కడా కర్నాటక సరిహద్దుల్లో మూలన విసిరేసినట్లుగా కుప్పం ఉంటుంది. ఇక్కడకు రావాలి అంటే బెంగుళూరు వెళ్ళి అక్కడ నుంచి రావడం సులువు. ఇక మూడు దశాబ్దాలకు పైగా చంద్రబాబు కుప్పాన్ని ఏలుతున్నారు. ఆయన మొదట టీడీపీ ఎమ్మెల్యేగా 1989లో గెలిచారు. ఆ తరువాత ఉమ్మడి ఏపీలో టీడీపీ ఉప నేతగా పదోన్నతి పొందారు. 1994లో మళ్లీ కుప్పం నుంచి గెలిచి ఆర్ధిక, రెవిన్యూ వంటి కీలక శాఖలను ఎనిమిది నెలల పాటు చూశారు. 1995 సెంప్టెంబర్ ఫస్ట్ నుంచి ముఖ్యమంత్రిగా కుప్పం జనాలకు కనిపించారు. 2004 తరువాత నుంచి పదేళ్ళ పాటు ప్రతిపక్ష నేతగా కూడా బాబును కుప్పం జనాలు ఎరుగుదురు. ఇక చంద్రబాబు 2014లో విభజన ఏపీకీ సీఎం అయ్యారు. ప్రస్తుతం విపక్ష నేతగా ఉంటున్నారు. మరి బాబుకు ఇన్ని హోదాలు ఇచ్చిన కుప్పానికి బాబు ఏమిచ్చి రుణం తీర్చుకున్నారు అంటే జవాబు డౌటే.

కుప్పంలో అభివృద్ధి లేదని అధికార వైసీపీ అంటోంది. అందుకే తాము కుప్పం పంచాయతీని మునిసిపాలిటీగా చేశామని చెబుతోంది. మునిసిపాలిటీ చేయడం తనకూ చేతనవును అని బాబు అంటున్నారు. అయితే పన్నుల మోత పెరుగుతుందనే చేయలేదు అంటున్నారు. మరి బాబు ఇచ్చిన వివరణ బాగుందా అంటే మేధావులు సైతం తప్పు పట్టేలా ఉంది. మునిసిపాలిటీగా ఉంటే ఆ సదుపాయాలు వేరుగా ఉంటాయి. దాని వల్ల వచ్చే అభివృద్ధి కూడా మరోలా ఉంటుంది. పన్నులు పెరుగుతాయి అనుకుంటే ఎపుడూ పంచాయతీగానే ఉంటుంది. మొత్తానికి కుప్పం విషయంలో బాబు ఏం చేయలేదో అది వైసీపీ చేసి చూపించింది. మరి కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. అక్కడ జనాలు ఎవరికి ఓటు చేస్తారు అన్నదే పాయింట్.

మొత్తాం పాతిక వార్డులు ఉన్నాయి. అన్నింటికీ టీడీపీయే గెలవాలని చంద్రబాబు గట్టిగానే కోరుతున్నారు. అయితే రాజకీయ కధ చూస్తే అలా జరిగే చాన్సే లేదు అంటున్నారు. కుప్పం లో పంచాయతీలు పరిషత్తులను ఒంటిచేత్తో గెలుచుకున్న వైసీపీ ఊరకే చూస్తూ ఉంటుందా. పైగా ఏరి కోరి మునిసిపాలిటీ చేశాక తొలి పీఠం తమకే దక్కాలనుకోవడం సహజం. ఇక కుప్పాన్ని టార్గెట్ చేసి కూడా ఉంది. అందువల్ల బాబు ఆలోచనలు ఆశలు నెరవేరే అవకాశాలు అయితే లేవు. అయితే కుప్పంలో లోకల్ బాడీ ఎన్నికల్లో ఓటమితో టీడీపీలో బాబులో మాత్రం చురుకు పుట్టింది. దాంతోనే ఆయన ఏడాదిలో రెండు సార్లు కుప్పానికి రావడం జరిగింది.

ఇలా బాబు ఇచ్చిన స్పూర్తితో తమ్ముళ్ళు మునిసిపల్ ఎన్నికల పోరులో పాల్గొంటే మాత్రం కచ్చితంగా ఢీ అంటే ఢీ ఫైట్ ఉంటుంది. అయినా సరే వైసీపీ గెలిచింది అంటే మాత్రం టోటల్ గా కుప్పం లో టీడీపీ ఓటమి సంపూర్ణం అవుతుంది. ఆ ఎఫెక్ట్ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పడుతుంది. మరి 2024లో బాబునే ఓడిద్దామని ప్లాన్ వేస్తున్న వైసీపీ కుప్పం మునిసిపాలిటీని వదిలే సీన్ లేదు కాబట్టి కుప్పం లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అన్నది మాత్రం బిగ్ డిస్కషన్ గా ఉంది. చంద్రబాబుకు అయితే కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలు మాత్రం అగ్ని పరీక్షగానే చెప్పాలి.