Begin typing your search above and press return to search.

ట్విట్టర్ కు తొందరలో మూడేట్లే ఉందిగా ?

By:  Tupaki Desk   |   26 Jun 2021 10:30 AM GMT
ట్విట్టర్ కు తొందరలో మూడేట్లే ఉందిగా ?
X
ప్రముఖ సామాజిక వేదికల్లో ఒకటైన ట్విట్టర్ కు ఏదో మూడినట్లే అనిపిస్తోంది. తాజాగా కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాను గంటపాటు నిలిపేసింది. అలాగే కాంగ్రెస్ ఎంపి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి ఛైర్మన్ శశిథరూర్ ఖాతాను కూడా కొద్దిసేపు నిలిపేయటం సంచలనంగా మారింది. దీంతో ట్విట్టర్ పై ఈ ఇద్దర ప్రముఖులు మండిపోతున్నారు. భారత్ లో కంటిన్యు అవ్వాలంటే కేంద్రప్రభుత్వం రూపొందించిన ఐటి చట్టాలను పాటించాల్సిందే అన్న నిబంధనల విషయంలో ఇటు కేంద్రానికి అటు ట్విట్టర్ కు మధ్య పెద్ద వివాదమే నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తదితర సామాజికమాధ్యమాలు కేంద్రం రూపొందించిన టిటి నిబంధనలను పాటించేందుకు అంగీకరించాయి. అయితే ట్విట్టర్ మాత్రం ధిక్కరించింది. భారత ఐటి చట్టాలను తాము ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని తమకు ప్రత్యేకంగా రూపొందించుకున్న విధానాలను మాత్రమే ఫాలో అవుతామని తెగేసి చెప్పింది. దాంతో రెండు వైపులా పెద్ద వివాదమే నడుస్తోంది. ఈమధ్య పార్లమెంటరీ కమిటి ముందు ట్విట్టర్ ప్రతినిధులు హాజరయ్యారు. అప్పుడు కూడా తమ విధానాలనే పాటిస్తామని చెప్పటంతో కేంద్రం మండిపోయింది.

మొత్తానికి ఎంత ఒత్తిడి చేసిన కేంద్రప్రభుత్వం నిబంధనలను పాటించటానికి ట్విట్టర్ అంగీకరించటంలేదు. మామూలుగా అయితే మరో దేశంలో అయితే ట్విట్టర్ ను నిలిపేసే విషయంలో ఎప్పుడో నిర్ణయం తీసేసుకునేవే. మరెందుకనో కేంద్రం మాత్రం ఈ విషయంలో మీన మేషాలు లెక్కిస్తోంది. ఒకవైపు కేంద్రాన్ని ధిక్కరిస్తున్నా ఇంకా ట్విట్టర్ ను కేంద్రం భరిస్తోంది. నిజానికి ఏ దేశంలో అయినా సామాజిక మాద్యమం అడుగుపెట్టాలన్నా, వ్యాపారం చేసుకోవాలన్నా ఆయా దేశం నిబంధనలను పాటించటం కనీస ధర్మం.

కానీ ట్విట్టర్ మాత్రం ఎంత విచిత్రంగా వాదిస్తున్నా కేంద్రం మాత్రం ఎందుకింత ఓపికగా ఉంటోందో అర్ధం కావటంలేదు. ఆమధ్య ఏకంగా నరేంద్రమోడి ఖాతానే కాసేపు నిలిపేసింది. కేంద్రమంత్రి ఖాతాను నిలిపేయటంలో కూడా పిచ్చిగా సమర్ధించుకుంటోంది. ఖాతాలో చేసిన పోస్టుపై అభ్యంతరాలు రావటంతోనే ఖాతాను నిలిపేసినట్లు చెప్పింది. నిజంగానే అంత అభ్యంతరాలుంటే సదరు పోస్టును తొలగిస్తే సరిపోతుంది కానీ ఏకంగా ఖాతానే గంటపాటు నిలిపేయటం ఏమిటో అర్ధం కావటంలేదు. మొత్తానికి ట్విట్టర్ మొండితనం వల్ల తొందరలోనే భారత్ లో నిషేధానికి గురైనా ఆశ్చర్యపోవక్కర్లేదేమో.