Begin typing your search above and press return to search.
పెద్దిరెడ్డికి మా పెద్ద చిక్కొచ్చిపడిందే
By: Tupaki Desk | 20 Dec 2022 4:36 AM GMTపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైఎస్సార్ సమకాలీనుడు. చంద్రబాబుకు ప్రత్యర్ధిగా ఉన్న వారు. రాజకీయంగా చిత్తూరు జిల్లాలో బలమైన నాయకుడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.దాంతో ఆయనకు సీమలో కీలక జిల్లాల బాధ్యతలు జగన్ అప్పగించేశారు. అలా వైసీపీని వచ్చే ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత పెద్దిరెడ్డి మీద పడిపోయింది.
ఆయనకు ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లా కూడా ఉంది. అంటే ఏకంగా 28 నియోజకవర్గాలో పార్టీని సెట్ చేయాలి. ఏపీలో అధికారం అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 88. అందులో మూడవ వంతు సీట్లను ఇపుడు పెద్దిరెడ్డి మ్యానేజ్ చేయాలన్న మాట. ఇక పెద్దిరెడ్డికి ఈ 28 సీట్లలో శిష్యులు దత్తపుత్రులు ఉన్నారు. వారు ఎమ్మెల్యేలు గా ప్రస్తుతం ఉన్నారు.
ఇక 2019 ఎన్నికల్లో వీరందరికీ టికెట్లు దగ్గరుండి ఇప్పించి ఆశీస్సులు అందించారు పెద్దిరెడ్డి. అలా ఎమ్మెల్యేలు అయిన శిష్యుల నియోజకవర్గాలలో ఇపుడు చాలా చోట్ల అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. స్థానిక నేతలు ఈసారి వీరికి టికెట్లు ఇవ్వవద్దు అంటూ రచ్చ చేస్తున్నారు. రోడ్డుకు ఎక్కుతున్నారు. పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉంటూ మూడేళ్ళ పాటు మంత్రి పదవిని నిర్వహించిన పెనుగొండ ఎమ్మెల్యే శంకరనారాయణ మాలగుండ్ల శంకరనారాయణ ఇలాకాలో వైసీపీలో అసమ్మతి మంటలు వీర లెవెల్లో ఉన్నాయి.
ఈ మధ్యనే అక్కడకు సమీక్షా సమావేశానికి పెద్దిరెడ్డి వెళ్తే శంకరనారాయణ వ్యతిరేక వర్గం పెద్దిరెడ్డికే ఏకంగా చెప్పులు చూపించి హల్చల్ చేసింది. ఇక హిందూపురంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ ని పెద్దిరెడ్డి దగ్గరకు తీస్తూంటే వద్దంటూ వైరి వర్గం పెద్దిరెడ్డికి నిరసన తెలియచేస్తోంది. ఈ రెండు చోట్లే కాదు, కదిరిలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్దారెడ్డికి అసమ్మతి తారస్థాయిలో ఉంది. సిద్దారెడ్డి పెద్దిరెడ్డి అనుచరుడి గానే ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఇక చిత్తూరు జిల్లాలో చూసుకుంటే పలమనేరులో వైసీపీలో అసమ్మతి జ్వాలలు అలా పాకుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే మీదనే వ్యతిరేకత కనిపిస్తోంది అంటున్నారు. అదే విధంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సైతం అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఆయన కూడా పెద్దిరెడ్డి చలవతో టికెట్ సంపాందించిన వారే కవడం విశేషం. మధుసూదన్ రెడ్డి కుటుంబంలోనే విభేదాలతో రచ్చగా మారింది అంటున్నారు.
ఇలా చూసుకుంటే ఒకరిద్దరు కాదు దాదాపుగా పెద్దిరెడ్డి శిష్య గణం అంతా ఇబ్బందుల్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వీరికి టికెట్లు ఇస్తే ఒక బాధ ఇవ్వకపోతే మరో బాధ అన్నట్లుగా పరిస్థితి ఉంది. పైగా పనిచేయని వారికి అసమ్మతి ఉన్న వారికి టికెట్లు ఇవ్వకూడదని జగన్ కచ్చితంగా భావిస్తారు.
దాంతో తన అనుచరులను శిష్యులను కాపా?డుకోవాడం ఒక ఎత్తు అయితే జగన్ తో చెప్పించి టికెట్లు ఇప్పించుకోవడం మరో ఎత్తు. మొత్తానికి చూస్తే పెద్దిరెడ్డి ఈ అసమ్మతి జ్వాలలను ఆర్పగలరా లేక వారిని తనవారిని పక్కన పెట్టి నియోజకవర్గాలలో గెలుపు గుర్రాలను చూడగలరా అన్నది అతి పెద్ద చర్చగా ఉంది. మొత్తానికి పెద్దాయన పెద్దిరెడ్డి మా చెడ్డ చిక్కుల్లో పడ్డారని అంటున్నారు అంతా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.