Begin typing your search above and press return to search.
కోటం రెడ్డి గొంతు కోస్తున్న పెద్ద నేతలు ఎవరు...?
By: Tupaki Desk | 21 Jan 2023 2:23 PM GMTజగన్ అన్న మూడక్షరాలు అంటే ప్రాణం పెట్టే నేత ఆయన. 2014, 2019లలో వరసబెట్టి రెండు సార్లు గెలిచిన నిఖార్సు అయిన వైసీపీ నేత. కార్యకర్త స్థాయి నుంచి లీడర్ గా ఎదిగిన కోటం రెడ్డి అంకితభావం గల నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. జగన్ మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా తనకు అవకాశం వస్తుంది అని ఆయన ఆశించారు. కానీ దక్కలేదు. దాంతో ఆయన నిరాశపడిన మాట వాస్తవం.
ఇపుడు చూస్తే ఆయనకు టికెట్ వస్తుందా రాదా అన్న డౌట్లు వచ్చేస్తున్నాయట. నెల్లూరు జిల్లా వైసీపీకి పెట్టని కోట. అలాంటి కోటలో ఇపుడు అనేకమైన అసంతృప్తి గొంతుకలు లేస్తున్నాయి. మాజీ మంత్రి పెద్దాయన వైసీపీలో 2019లో చేరిన నేత కాబట్టి ఆనం రామనారాయణరెడ్డి విమర్శలు చేశారు అంటే ఓకే అనుకున్నా జగన్ అంటే ప్రాణం ఇచ్చే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అంతే స్థాయిలో గొంతు పెంచుతున్నారు అంటే ఎలా చూడాలన్నది ఇపుడు పార్టీలోని వారికే ప్రశ్నగా ఉంది.
కోటం రెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా తన నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనులూ సాగడంలేదని మధనపడుతున్నారు. పైగా ఆయన అధికారులతోనే గొడవ పెట్టుకుంటున్నారు. ఫక్తు ప్రతిపక్ష నాయకుడి మాదిరిగా రోడ్ల మీదకు వచ్చి ఆందోళలను చేస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి హాట్ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఆయనను జగన్ ఈ మధ్యనే పిలిపించుకుని ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నారు అని టాక్ నడిచింది. పార్టీని బజారున పడేయవద్దు అంటూ జగన్ కోటం రెడ్డిని ఆదేశించారని కూడా చెప్పుకున్నారు.
దాంతో కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న కోటం రెడ్డి తాజాగా బిగ్ సౌండ్ చేశారు జిల్లాలోని కొందరు పెద్ద నాయకులు తన గొంతు బలంగా నొక్కుతున్నారని ఆయన మండిపడుతున్నారు. ఆ పెద్ద నేతలే తనను అణగదొక్కాలని చూస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. తాను రాజకీయ కుటుంబం నుంచి రాలేదని, సాధారణ కార్యకర్తగా పనిచేసుకుంటూ పోతున్నాను అని చెప్పుకొచ్చారు. తాను తన వారు అనుకున్న వారి కోసం ఏమైనా చేయడానికి ఎంతకైనా వెనకాడేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.
నెల్లూరు జిల్లాలోని పెద్ద కుటుంబాలకు చెందిన నాయకులే తన గొంతు కోస్తున్నారు అని ఆయన అనడం ఎవరి మీద అన్న చర్చ సాగుతోంది. తన రాజకీయ ఎదుగుదలకు వారే అడ్డంకిగా మారారు అని ఆయన వాపోతున్నారు. ఎంపీ ఎమ్మెల్యే, మంత్రి పదవులు అన్నీ వారి ఇంటికే రావాలని కోరుకున్న పెద్ద నాయకులే తనను అణగదొక్కుతున్నారని ఆయన విమర్శించారు.
అంతే కాదు తాము తమ కుమారులు, తమ బామ్మర్దులు, మనవళ్ళు ఇలా అంతా తమవారే ఉండాలన్న కోరికతో కొందరు పెద్దలు చేస్తున్న రాజకీయ పెత్తనం మీద కోటం రెడ్డి బాహాటంగానే ద్వజమెత్తారు. తాను కార్యకర్త స్థాయి నుంచి పార్టీలో పనిచేస్తూ వస్తున్నాను అని తాను నమ్ముకున్న పార్టీ కోసం కేసులను సైతం భరిస్తూ వచ్చాను అని ఆయన అంటున్నారు.
తాను పోలీస్ దెబ్బలూ చూశాను.లాకపులూ చూశాను అని ఆయన అంటున్నారు. తన జోలికి వస్తే సహించేది లేదని, ఎంతటి పెద్ద నాయకులు అయినా వారి ఆటలు సాగనీయకుండా చేస్తాను అని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించడం విశేషం. మరి జగన్ ఆయన నోరు మెదపవద్దని చెప్పారు. కానీ ఇపుడు కోటం రెడ్డి గీతా దాటారు అని అంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి ఆనం కి తనదైన షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన జగన్ కోటం రెడ్డి విషయంలో కూడా సీరియస్ యాక్షన్ కి దిగుతారా అన్న చర్చ అయితే సాగుతోంది.
ఇంతకీ నెల్లూరు జిల్లాలో కోటం రెడ్డి గొంతు కోస్తున్న పెద్ద నేతలు పెద్ద రాజకీయ కుటుంబాలు ఎవరు అనందే ప్రశ్నగా ఉంది. మరి రాజకీయం ఆ మాత్రం తెలిసిన వారికి జవాబు దొరికే ఉంటుందని కోటం రెడ్డి ఆ పేర్లు చెప్పడంలేదుట. కానీ తగలాల్సిన వారికి బాగానే తగ్లీఅయని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.