Begin typing your search above and press return to search.

పెద్ద నోట్లు రద్దయిన.. ఇప్పటికీ క్యాషే కింగ్..!

By:  Tupaki Desk   |   3 Jan 2023 9:30 AM GMT
పెద్ద నోట్లు రద్దయిన.. ఇప్పటికీ క్యాషే కింగ్..!
X
ఆరేళ్ల క్రితం బీజేపీ సర్కార్ పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు చెలామణిలో ఉన్న కరెన్సీలో నగదు వాటానే అధికంగా ఉండేది. ఇందులో 86శాతం వెయ్యి.. ఐదొందల నోట్లేదే ఎక్కువ వాటా. అయితే ప్రధాని మోదీ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో పెద్ద నోట్లన్నీ రద్దయిన సంగతి తెల్సిందే..!

అయితే పెద్ద నోట్ల రద్దు నాటితో పోలిస్తే ప్రస్తుతం జనం దగ్గర ఉన్న నగదు ఎక్కువని గణాంకాలు చెబుతుండటం విశేషం. పెద్ద నోట్ల రద్దుకు ముందు చెలామణిలో ఉన్న కరెన్సీ విలువ 17.74 లక్షల కోట్ల రూపాయలు కాగా పెద్ద నోట్ల రద్దుతో వీటి విలువ ఏకంగా తొమ్మిది లక్షల కోట్లకు పడిపోయింది.

కాగా 2022 డిసెంబర్ 23 నాటికి దేశంలో చెలామణిలో ఉన్న కరెన్సీ విలువ 32.42కోట్ల లక్షలకు చేరిందని ఆర్బీఐ గణంకాలు చెబుతుండం గమనార్హం. అప్పట్లో రద్దయిన నోట్లను మార్చుకోవడానికి కేంద్రం 52 రోజుల గడువు ఇవ్వగా ఆలోపే రూ.15.3 లక్షల కోట్ల పెద్ద నోట్లు బ్యాంకుల్లో జమయ్యాయి. సుమారు 99.3 శాతం పెద్ద నోట్ల వెనక్కి వచ్చాయని ఆర్బీఐ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రభుత్వం ఏం సాధించిందనే ప్రశ్నలు తలెత్తాయి. పెద్దనోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ కొత్త 2వేల నోట్లను ప్రవేశపెట్టింది. అలాగే 500 రూపాయల నోట్లను సరికొత్తగా తీసుకొచ్చింది. వెయ్యి నోటు మాత్రం మళ్లీ ప్రవేశపెట్టలేదు.

ఈ క్రమంలోనే భారత్ లో డిజిటల్ పేమెంట్స్ వైపు ప్రజలు మొగ్గుచూపారు.ప్రస్తుతం ప్రపంచంలోనే ఇండియా డిజిటల్ పేమెంట్స్ లో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు నగదు చెలామణిలోనూ అంతకంతకు పెరుగుతుందని గణంకాలు చెబుతున్నాయి.

2015-16 ఏడాదిలో నగు చెల్లింపుల వాట 88 శాతం కాగా అది 2021-22 నాటికి 20 శాతం మేర తగ్గింది. 2026-27 నాటికి 11 శాతానికి పరిమితం కానుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. అలాగే 2015-16లో 11.26 శాతం ఉండగా 2021-22 నాటికి 80 శాతానికి పెరిగింది. 2026-27 కల్లా ఈ వాటా 88 శాతానికి చేరుకునే అవకాశం ఉందని ఆర్బీఐ అంచనా వేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.