Begin typing your search above and press return to search.

టీడీపీలో ఇదో పెద్ద స‌మ‌స్య‌.. న‌వ్వాలో.. న‌వ్వించాలో తెలియ‌ట్లేదుగా...!

By:  Tupaki Desk   |   7 Dec 2022 5:55 AM GMT
టీడీపీలో ఇదో పెద్ద స‌మ‌స్య‌.. న‌వ్వాలో.. న‌వ్వించాలో తెలియ‌ట్లేదుగా...!
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీలో చిత్ర‌మ‌న ప‌రిస్తితి ఏర్ప‌డుతోంది. పార్టీలో ఒక‌వైపు సంతోషం..మ‌రోవైపు ఆవేద‌న రెండూ క‌నిపి స్తున్నాయి. త‌మ నాయ‌కుడు చంద్ర‌బాబు ఇమేజ్‌.. విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా ఆయ‌న‌కు గుర్తింపు మ‌రింత పెరిగింది.

తాజాగా జీ20 స‌న్నాహ‌కాల‌కు సంబందించి అఖిల ప‌క్ష భేటీ నిర్వ‌హించిన మోడీ.. చంద్ర‌బాబును కూడా ఆహ్వానించారు. ఆ.. ఇదేముందిలే అంద‌రినీ పిలిచిన‌ట్టుగా చంద్ర‌బాబును కూడా పిలిచారు అని వైసీపీ నాయ‌కులు తెర‌చాటు ప్ర‌చారం చేశారు. ఇక‌, టీడీపీ నాయ‌కులు కూడా దీనిని లైట్ తీసుకున్నాయి.

అయితే, అనూహ్యంగా ఇత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను సైతం ప‌క్క‌న పెట్టి.. చంద్ర‌బాబు ఈ స‌మావేశంలో 20 నిముషాల‌పాటు ప్ర‌సంగించ‌డం.. అద్భుతమైన విజ‌న్‌ను అందించ‌డం.. రాబోయే 25 ఏళ్ల‌కు సంబంధించిన ఆలోచ‌న‌ల‌ను పంచుకోవ‌డం, ము ఖ్యంగా డిజిట‌ల్ విధానాన్ని మ‌రింత దూకుడుగా ముందుకు తీసుకువెళ్లి.. యువ‌శ‌క్తిని వినియోగించుకోవాల‌ని పిలుపునివ్వ‌డం వంటివి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అంత‌టి వాడిని కట్టిప‌డేశాయి.

ఇంకేముంది.. అన్ని ప్ర‌ధాన ప‌త్రిక‌ల్లో చంద్ర‌బాబు హైలెట్ అయ్యారు. రాష్ట్ర‌, జాతీయ ప‌త్రిక‌ల్లోనూ చంద్ర‌బాబు విజ‌న్‌పై మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. అక్క‌డితో సినిమా అయిపోలేదు. చంద్ర‌బాబు విజ‌న్‌కు మంత్ర‌ముగ్ధుడైన ప్ర‌ధాని.. వెంట‌నే నీతి ఆయోగ్ సీఈవో ను కూడా క‌లిసి.. త‌న విజ‌న్‌ను పంచుకోవాల‌ని సూచించారు. దీంతో చంద్ర‌బాబు సైతం రెండో రోజు ఢిల్లీలోనే ఉండి నీతి ఆయోగ్ సీఈవోతో భేటీ అయ్యారు.

కానీ, అదేస‌మ‌యంలో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ జీ20 అఖిల ప‌క్ష స‌మావేశం అయిపోగానే తాడేప‌ల్లికి చేరుకున్నారు. ప్ర‌ధానిని కూడా ఆయ‌న ప్ర‌సంగం మెప్పించ‌లేక పోయింది. పైగా రాజ‌కీయాల ను ప్ర‌స్తావించ‌డంతో ఆయ‌న ప్ర‌సంగం గురించిన చ‌ర్చ కూడా ఎక్క‌డా రాలేదు. ఈ ప‌రిణామంతో చంద్ర‌బాబు గ్రాఫ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. ఇది టీడీపీలో సంతోషం వెల్లివిరిసేలా చేసింది.ఒక‌ర‌కంగా ఇప్పుడున్న ప‌రిస్థితిలో చంద్ర‌బాబు ఇమేజ్ రాష్ట్రానికి ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే విష‌యాన్ని వారు ప్ర‌చారం చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది.

ఇది ఒక ఆనందం.. సంతోషం.. హ‌ర్షం! అయితే, మ‌రోవైపు నాణేనికి రెండో కోణం.. అన్న‌ట్టుగా రాజ‌కీయంగా ఇదే మోడీ.. ప‌వ‌న్‌ను పార్టీకి దూరం చేయ‌డం, జ‌న‌సేన‌ను హెచ్చ‌రించ‌డం.. రాజ‌కీయంగా చంద్ర‌బాబుతో చేతులు క‌లిపే విష‌యాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం వంటివి మాత్రం టీడీపీ నేత‌ల‌కు ఆవేద‌న‌.. అంత‌కుమించి దుఖం క‌లిగిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే.. జీ20 కొంత ఆనందం నింపితే.. మ‌రికొంత ఆవేద‌న మిగిల్చింద‌నేది త‌మ్ముళ్ల ఆవేద‌న‌.