Begin typing your search above and press return to search.
పాపం.. ఛానెళ్లకు కంటెంట్ అయిపోయిందిగా
By: Tupaki Desk | 26 April 2018 9:38 AM GMTటీవీ ఛానెళ్లపై ఎవరెన్ని విమర్శలు సినిమా.. టీఆర్పీ రేటింగ్స్ బాగా వచ్చే కార్యక్రమాలకే వాళ్లు పెద్ద పీట వేస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. దాదాపు రెండు నెలలుగా శ్రీరెడ్డి ఇష్యూ మీద టీవీ ఛానెళ్ల చర్చలు జరిగాయి. ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. ముందు ఒకట్రెండు ఛానెళ్లే ఆమెతో డిస్కషన్లు పెట్టాయి. తర్వాత మిగతా ఛానెళ్లూ అందిపుచ్చుకున్నాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యాలయం ముందు శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేశాక ఆమెపై జనాల్లో ఏహ్య భావం కలిగింది. కొన్ని రోజుల పాటు శ్రీరెడ్డిని చర్చలకు పిలవడానికి ఛానెళ్లు సందేహించాయి. కానీ ఆమె దగ్గుబాటి అభిరామ్ తో ఉన్న ఫొటోలు లీక్ చేయడం.. మరికొన్ని సంచలన ఆరోపణలు చేయడంతో ఛానెళ్లు మళ్లీ ఆమెను స్టూడియోలకు రప్పించక తప్పలేదు. ఈ క్రమంలో శ్రీరెడ్డితో నిర్వహించిన చర్చలు కొన్ని శ్రుతి మించిపోయాయి.
న్యూస్ ఛానెళ్లు పెట్టాలంటే ఫ్యామిలీలు భయపడే పరిస్థితి వచ్చింది. అంత దారుణమైన మాటలు వినాల్సి వచ్చింది ఈ కార్యక్రమాల్లో. దీంతో న్యూస్ ఛానెళ్ల విషయంలో జనాలకు చాలా చీప్ అభిప్రాయం వచ్చేసింది జనాలకు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. ఛానెళ్లకు వ్యతిరేకంగా నెగెటివ్ క్యాంపైన్ కూడా నడిచింది. పవన్ కళ్యాణ్ చేసిన పోరాటానికి కూడా పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. దీంతో పరిస్థితి అదుపు తప్పుతోందని.. జనాల్లో అసహనం బాగా పెరిగిపోయిందని ఛానెళ్లు గుర్తించాయి. శ్రీరెడ్డి ఇష్యూలో పిండటానికి ఇక రసం ఏమీ లేకపోవడంతో ఇక దాన్ని వదిలేయడానికే చూస్తున్నట్లున్నాయి ఛానెళ్లు. దీనికి సంబంధించిన కంటెంట్ ఇప్పుడు ఛానెళ్లలో కనిపించడం లేదు. వేరే ఇష్యూల మీదికి మళ్లారు అందరూ. ఇది కొంచెం జనాలకు ఉపశమనాన్ని ఇచ్చే విషయమే. పవన్ ను తిట్టడంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రస్తుతం శ్రీరెడ్డి కూడా సైలెంటుగా ఉంది. ఆమె మళ్లీ ఏవైనా ఆరోపణలతో ముందుకొస్తే తప్ప ఈ ఇష్యూ మీద ఛానెళ్ల చర్చలకు తెరపడినట్లే.