Begin typing your search above and press return to search.
మూడు నెలల్లోనే ఆప్ కు గట్టి ఎదురుదెబ్బ..
By: Tupaki Desk | 27 Jun 2022 6:17 AM GMTమూడు నెలల కిందట ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్ లో అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటి వరకు ఢిల్లీలో మాత్రమే ఉన్న ఈ పార్టీ రెండో రాష్ట్రంలో అడుగుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ హవా సాగిస్తున్న తరుణంలో ఆ పార్టీకి అప్ బీటలు కొడుతుందా..? అన్న చర్చలు కూడా మొదలయ్యాయి. ఇదే ఊపుతో ఆప్ మిగతా రాష్ట్రాల్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అయితే తాజాగా పంజాబ్ లో జరిగిన ఉప ఎన్నికలో అధికారంలో ఉన్న ఆప్ కు స్థానిక ప్రజలు తిరుగుబాటు ప్రకటించారు.ఈ ఉప ఎన్నికలో బరిలో ఉన్న ఆప్ అభ్యర్థిని దారుణంగా ఓడించారు. దీంతో మూడు నెలల వ్యవధిలోనే ఆప్ ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెందారా..? అనే చర్చ మొదలైంది.
పంజాబ్ లో ప్రస్తుతం ఆప్ ప్రభుత్వం కొనసాగుతోంది. ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ బాధ్యతలు చేపట్టారు. 2014, 2019 ఎన్నికల్లో భగవంత్ మాన్ పంజాబ్ లోని నంగ్రూర్ లోక్ సభ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో ఆప్ 117 సీట్లకు గాను 92 స్థానాల్లో విజయం సాధించడంతో ప్రభుత్వం ఏర్పాటు మార్గం సుగమైంది. ఆ సమయంలో కాంగ్రెస్ 18, శిరోమణి అకాలీదళ్ -బీఎస్పీ కూటమిలకు 5 సీట్లు వచ్చాయి. దీంతో ఆప్ ఎమ్మెల్యేలంతా భగవంత్ మాన్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన నంగ్రూర్ లోక్ సభకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఫలితంగా ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఈనేపథ్యంలో ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. ఇక్కడ ఆప్ తరుపున గుల్మైర్, అకాళీదళ్ అభ్యర్థి సిమ్రన్ జిత్ మాన్ బరిలో దిగారు. అయితే ఆప్ అభ్యర్థి గుల్మైర్ పై 8వేల ఓట్ల మెజారిటీతో సిమ్రన్ జిత్ మాన్ విజయం సాధించారు. కొన్ని ఓట్ల తేడా ఉండే విషయం వేరే ఉండేది.
కానీ 8 వేల ఓట్ల మెజారిటీ ప్రత్యర్థి గెలుపొందడంతో ఆప్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పంజాబ్ లో అధికారం చేపట్టిన తరువాత ఇక తమకు తిరుగులేదని ఆప్ శ్రేణులు ఆశపడ్డారు. కానీ కొద్ది కాలంలోనే ఇలా అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగలడం చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా భగవంత్ మాన్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం ఈ ఉప ఎన్నికపై ప్రభావం చూపిందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. స్వర్ణ ప్యాలెస్ లోకి మద్యం సేవించి రావడం.. ఇతర పార్టీలు చేసే ఆరోపణలకు సరైన సమాధానం చెప్పకపోవడం ఆప్ పార్టీకి కలిసి రావడం లేదంటున్నారు.
అలాగే ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు ప్రముఖులకు సెక్యూరిటీని తగ్గించడంపై కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో వ్యక్తిగతంగా భగవంత్ మాన్ ప్రతిష్ట దెబ్బదినడంతో పాటు ఓవరాల్ గా ఆప్ పై ప్రభావం చూపుతుందని అంటున్నారు. మరి ఈ విషయంలో ఆప్ వ్యవస్థాపకుడు కేజ్రీవాల్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.