Begin typing your search above and press return to search.

పండగల వేల బిగ్ షాక్..దేశంలో కరోనా సెకండ్ వేవ్

By:  Tupaki Desk   |   18 Oct 2020 11:10 AM GMT
పండగల వేల బిగ్ షాక్..దేశంలో కరోనా సెకండ్ వేవ్
X
ఇటీవల ఎక్కడ చూసినా ఒకటే చర్చ..కరోనా తగ్గుముఖం పడుతోందంట కదా.. అని కాస్త కేసులు తగ్గుముఖం పట్టగానే ఈ న్యూస్ భలే స్ప్రెడ్ అయ్యింది. దీంతో జనాల్లో భయం తగ్గిపోయింది. మాస్కులు వేసుకునే తిరిగే జనం సంఖ్య రోజు రోజుకూ తగ్గుతోంది. ఇటువంటి సమయంలో వైద్య నిపుణులు షాకింగ్ న్యూస్ చెప్పారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైందని నిర్ధారిస్తున్నారు. కేరళలో ఓనం పండగ కరోనా తగ్గిందని చాలా గ్రాండ్ గా జనం ఒక్కటై వేడుకలు చేసుకోగా అక్కడ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఢిల్లీలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. దేశంలో చాలా రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరిగి ఐసీయూ వార్డులు నిండిపోతున్నాయి. ఇది ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. మన దేశమే కాదు చాలా దేశాల్లో మహానగరాల్లో వైరస్‌ కట్టడి కోసం మరోసారి లాక్‌డౌన్లు విధిస్తున్నాయి.

స్పెయిన్‌లో 14 ఏళ్లలోపు పిల్లలను ఇళ్లకే పరిమితం చేయాలని ఆంక్షలు విధించారు. ఇటలీలో అత్యవసర మైతేనే బయట అనుమతి ఇస్తున్నారు.

ఫ్రాన్స్‌లో అయితే గంట మాత్రమే బయట తిరగడానికి అనుమతి ఇస్తున్నారు. అది కూడా కిలోమీటర్‌ పరిధిలోపే వెళ్లి రావాలి.అమెరికా కూడా మరోసారి లాక్‌డౌన్‌ విధించే ప్రయత్నాల్లో ఉంది. ఆ దేశంలో రోజు సగటున 50వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. బ్రెజిల్‌లోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.

మన దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తొలిసారిగా ఢిల్లీలో మొదలైంది.జూలై, ఆగస్టులో తగ్గి సెప్టెంబర్‌లో మళ్లీ పెరిగాయి కేరళలో ఓనం పండుగ బాగా జరిపారు. దీంతో అక్కడ మళ్లీ కొత్త కేసుల సంఖ్య అధికమైంది.

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా పండగలు

తెలుగురాష్ట్రాల్లో మరో మూడు నెలల్లో బతుకమ్మ, దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగలు వరుసగా రానున్నాయి. కరోనా తగ్గిందని అందరూ ఒక్క చోట చేరితే కేరళలో మాదిరే కరోనా మళ్లీ పంజా విసిరే అవకాశం ఉంది.