Begin typing your search above and press return to search.

ఓట్ల లెక్కింపు వేళ డిప్యూటీ సీఎంకు బిగ్ షాక్..1000 కోట్ల ఆస్తులు అటాచ్

By:  Tupaki Desk   |   2 Nov 2021 7:44 AM GMT
ఓట్ల లెక్కింపు వేళ డిప్యూటీ సీఎంకు బిగ్ షాక్..1000 కోట్ల ఆస్తులు అటాచ్
X
మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ఎన్సీపీకి ఐటీ, ఈడీ తాజాగా షాకుల మీద షాకులు ఇచ్చాయి.ఇప్పటికే మాజీ హోంమంత్రిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే మరోసారి పంజా విసిరారు.

ఎన్సీపీ నుంచి మహారాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ కు హైఓల్టేజ్ షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన ఆస్తులను భారీగా అటాచ్ చేశారు ఐటీశాఖ అధికారులు. అటాచ్ చేసిన ఈ ఆస్తుల విలువ 1000 కోట్ల రూపాయలు. దీంతో అజిత్ పవార్ కు గట్టి షాక్ తగిలింది.

ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ అరెస్ట్ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.సుమారు 12 గంటల పాటు విచారించారు. కోర్టులో ప్రవేశపెట్టారు. కస్టడీకి అప్పగించాలని కోరారు.

ఈ దఫా ఏకంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎంపై ఈడీ కొరఢా ఝలిపించింది. ఆయన భారీ ఆస్తులను ఐటీశాఖ అధికారులు అటాచ్ చేయడం కలకలం రేపింది. సంకీర్ణ కూటమి నాయకులను ఇది ఊపిరి ఆడనివ్వకుండా చేస్తోంది. బినామీ ప్రాపర్టీల కింద వాటిని అటాచ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. బినామీ పేర్లతో వేర్వేరు రాష్ట్రాల్లో అజిత్ పవార్ కు పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నారు.

ఢిల్లీ దక్షిణ ప్రాంతంలో 20 కోట్ల రూపాయల విలువ చేసే ఫ్లాట్, ముంబైలోని నిర్మల్ హౌస్ ప్రాంతంలో ఉన్న పార్థ్ పవార్ ఆఫీస్ ను ఈడీ అటాచ్ చేసింది. బరందేశ్వర్ లోని చక్కెర ఫ్యాక్టరీని కూడా అటాచ్ చేసిన ఆస్తుల జాబితాలో చేర్చారు. దీని విలువ 600 కోట్ల రూపాయలు.