Begin typing your search above and press return to search.
జేసీ కుటుంబానికి బిగ్ షాక్ ..ఆయన పై జిల్లా బహిష్కరణ వేటు ?
By: Tupaki Desk | 4 Dec 2019 9:00 AM GMTమాజీ ఎంపీ దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఈ ఇద్దరు కూడా గత కొన్నేళ్లుగా అనంతపురం జిల్లాలో రాజకీయాన్ని శాసిస్తూ వస్తున్నారు. అలాగే వీరికి రాజకీయంగా ఉన్న పాపులారిటీ తో వీరు ఆడిందే ఆట, పాడిందే పాటగా ఇన్నేళ్లు వీరి హావ బాగానే నడిచింది. కానీ , గత కొన్ని రోజులుగా జిల్లాలో సంఘవిద్రోహక శక్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజలపై ఎవరైనా దౌర్జన్యం చేసినట్టు తెలిస్తే వారిని కఠినంగా శిక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ప్రజలపై దౌర్జన్యం చేసే వారిపై ఉక్కుపాదం మోపుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జేసీ బ్రదర్స్ కి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఎస్‌వీ రవీంద్రా రెడ్డి పై జిల్లా బహిష్కరణకు పోలీసులు రంగం సిద్ధం చేశారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం.
సంగటి రవీంద్రా రెడ్డి అలియాస్ పొట్టి రవి 2003 లో జేసీ బ్రదర్స్ తో చేతులు కలిపి , నమ్మిన బంటుగా మారాడు. దాడులు, దౌర్జన్యాల విషయం లో జేసీ వర్గానికి పొట్టి రవినే నాయకత్వం వహిస్తుంటాడు. వారి అండదంలతో రవి ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. హత్యాయత్నాలు, దొమ్మిలు, మారణాయుధులు కలిగి ఉండడం వంటి వ్యవహారాల్లో పొట్టి రవిపై ఇప్పటికే 11 కేసులు ఉన్నాయి. కానీ , అప్పట్లో ఎవరు ఆయన్ని టచ్ చేయలేకపోయారు.
2003లో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్న ఘటన, 2004లో అక్రమ ఆయుధాలు కలిగి ఉండడంపై కేసు నమోదు , 2015లో అల్ట్రాటెక్ట్ సిమెంట్ పరిశ్రమలో సామగ్రిని ధ్వంసం చేసిన కేసు, 2017లో తాడిపత్రి మండలం, పెద్దపొలమడ గ్రామం సమీపంలోని ప్రభోదానంద ఆశ్రమానికి చెందిన వాటర్ ట్యాంక్ దగ్ధం కేసు , 2018లో వినాయక చవితి నిమజ్జన సందర్భంగా చేలరేగిన ఘర్షణలో కేసు , 2019లో వీరాపురం గ్రామానికి చెందిన అనిల్‌కుమార్‌రెడ్డి పై హత్యాయత్నం కేసు ఇలా పలురకాలైన కేసుల్లో రవి నిందుతుడిగా ఉన్నాడు. ఇన్ని రోజులు జేసీ ఫ్యామిలీ సపోర్ట్ పూర్తిగా ఉండటంతో రవి జోలికి ఎవరు పోలేదు. కానీ , ఇప్పుడు పోలీసులు సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుండటం తో అయన అరాచకాలు తెలిసిన జిల్లా ఎస్పీ రవి పై పీడీ యాక్ట్ ప్రయోగించారు. తాజాగా జిల్లా బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం.