Begin typing your search above and press return to search.

పవన్ కి బిగ్ షాక్ .. వైసీపీ కి మద్దతుగా రాపాక ?

By:  Tupaki Desk   |   11 Dec 2019 9:30 AM GMT
పవన్ కి బిగ్ షాక్ .. వైసీపీ కి మద్దతుగా రాపాక ?
X
ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ పరిస్థితి ఏమిటో కనీసం అధినేత కి కూడా ఒక క్లారిటీ లేనట్టు చాలా స్పష్టంగా అర్థమౌతుంది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ రాష్ట్రమంతా పోటీ చేయగా ..కేవలం ఒకే ఒక స్థానంలో గెలుపొందింది. అది కూడా పార్టీ ప్రభావంతో కాదు ..కేవలం వ్యక్తిగత ఇమేజ్ తోనే రాపాక వరప్రసాదరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జనసేన లో ఉన్నది ఒక్కరే ఎమ్మెల్యే అయినప్పటికీ ..ఆయనే ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారారు.

టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ ఒకవైపు ..ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తుంటే .. మరోవైపు జనసేన పార్టీ తరపున అసెంబ్లీ లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రాపాక మాత్రం .. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీషు ప్రవేశపెట్టాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థించారు. సీఎం జగన్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపై గతంలో ఓ ప్రయత్నం చేశారన్నారు. మరి ఇప్పుడెందుకు చంద్రబాబు జగన్‌ను అడ్డుకుంటున్నారన్నారు.

ఇక మరోవైపు మర్యాదగా ఉండదు అంటూ స్పీకర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సైతం జనసేన ఎమ్మెల్యే తప్పుబ్టటారు. పార్టీలు వేరైనా స్పీకర్ ఛైర్‌ను గౌరవించాల్సిన బాధ్యత ఉందన్నారు. రాపాక తాను పార్టీ మారను అంటూ ఫస్ట్ నుంచి క్లియర్‌గా చెబుతూనే ఉన్నారు. మరోవైపు వైసీపీ పట్ల సానుకూల ధోరణిని వ్యక్తపరుస్తూనే ఉన్నారు. గతంలో సీఎం జగన్‌ ఫోటోకు పాలాభిషేకం చేసిన రాపాక వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఇంగ్లీష్ మీడియం విషయంలో పవన్ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్న సమయంలో ప్రభుత్వానికి మద్దతుగా జేఎస్పీ ఎమ్యెల్యే రాపాక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.