Begin typing your search above and press return to search.

రఘురామరాజుకి పెద్ద షాక్

By:  Tupaki Desk   |   1 Jan 2022 6:35 AM GMT
రఘురామరాజుకి  పెద్ద షాక్
X
వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సీబీఐ షాకిచ్చింది. ఎంపీకి న్యూయియర్ గిఫ్ట్ అన్నట్లుగా ఆయనపై చార్జిషీట్ ఫైల్ చేసింది. థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో ఆర్థిక సంస్ధలు, బ్యాంకులకు రు. 941 కోట్లు మోసం చేసిన అభియోగాలపై ఎప్పటి నుంచో దర్యాప్తు జరుగుతోంది. ఆర్ధిక సంస్ధలు, బ్యాంకుల నుంచి ఒక కారణంతో అప్పు తీసుకుని దాన్ని దారి మళ్ళించారనే ఆరోపణలున్నాయి. తీసుకున్న అప్పును ఎంతకీ తిరిగి చెల్లించకపోవటంతో స్వయంగా అప్పులిచ్చిన బ్యాంకులే ఎంపీపై ఫిర్యాదు చేశాయి.

బ్యాంకుల ఫిర్యాదుతో కేంద్ర దర్యాప్తు సంస్ధలు చేసిన విచారణలో ఎంపీ మోసం చేసినట్లు నిర్ధారణయ్యింది. దాంతో ఆయనపై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. ఇదంతా జరిగింది 2019, ఏప్రిల్లో. అప్పటినుండి ఆయనపై ఛార్జిషీటు ఫైల్ చేయటానికి ప్రయత్నిస్తునే ఉన్నా సాధ్యం కావటం లేదు. ఎందుకంటే వైసీపీ తరపున గెలిచిన రఘురాజు బీజేపీ మద్దతుదారుడిగా మారిపోయారు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డిపై ఒంటికాలిమీద లేస్తున్నారు. ముందు ప్రభుత్వాన్ని తర్వాత వ్యక్తిగతంగా జగన్ను టార్గెట్ చేయటం మొదలుపెట్టారు.

కేంద్రంలోని బీజేపీకి మద్దతుదారుడిగా మారిన కారణంగానే దర్యాప్తు సంస్ధలు ఆయన జోలికి వెళ్ళటం లేదనే ఆరోపణలు కూడా పెరిగిపోయాయి. ఈ నేపధ్యంలోనే రాజు మోసంపై దర్యాప్తు చేసిన సీబీఐ బ్యాంకుల ఫిర్యాదంతా నిజమే అని నిర్ధారణ కూడా చేసింది. రాజుతో పాటు ఆయన భార్య, కుటుంబ సభ్యులు, సంస్ధల్లో కీలక వ్యక్తులు మొత్తం మీద ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ కోర్టులో ఛార్జిషీటు ఫైల్ చేసింది. ఆ తర్వాత ఎంపీ నిధులను తీసుకున్న పద్దతి, మోసం చేసిన విధానంపై డీటైల్డ్ గా ఒక ప్రకటన కూడా చేసింది.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే బ్యాంకుల కన్సార్షియం దగ్గర తీసుకున్న అప్పుల కన్నా తనఖా పెట్టిన ఆస్తుల విలువ తక్కువని తేలింది. దాంతో ఆస్తులన్నింటినీ అమ్మేసి అప్పులు తీర్చటానికి దివాలా ప్రక్రియ ను కంపెనీస్ లా బోర్డులో కేసు దాఖలైంది. అన్ని వివరాలను పరిశీలించిన కంపెనీ లా బోర్డు దివాలా ప్రక్రియకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పుల కోసం ఎక్కడెక్కడ ఆస్తులను బ్యాంకుల్లో పెట్టిన తనఖానంతా ఆయా బ్యాంకులే సొంతం చేసుకుని అమ్ముకుని తమ అప్పులను రాబట్టుకునేందుకు కంపెనీస్ లా బోర్డు ఓకే చెప్పింది.

ఇలాంటి పరిస్థితి తనకు వస్తుందని ఎంపీ అంచనా వేసే బీజేపీతో సఖ్యతగా ఉంటున్నారని కూడా పలువురు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మరిపుడు సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసిన తర్వాత నెక్ట్స్ స్టెప్ ఏమిటనేది ఆసక్తిగా మారింది. ఎంపీయే కాదు బీజేపీలోకి ఫిరాయించిన మరికొందరు రాజ్యసభ ఎంపీల మీద కూడా బ్యాంకులను దోచుకున్న ఫిర్యాదులే ఉన్నాయి. వీళ్ళ ఫిర్యాదులను కూడా సీబీఐ దర్యాప్తు చేసి చేసిన మోసాలను నిర్దారించినట్లు ప్రచారంలో ఉంది. మరి వీళ్ళపై ఛార్జిషీటు ఎప్పుడు ఫైల్ అవుతుందో చూడాలి.