Begin typing your search above and press return to search.
వైసీపీ ఓట్ల తొలగింపునకు భారీ కుట్ర!
By: Tupaki Desk | 27 Jan 2019 8:59 AM GMTవచ్చే ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ పార్టీ విజయం తథ్యమని గ్రహించిన అధికార తెలుగుదేశం పార్టీ కుట్రలకు దిగుతోందా? భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు-మద్దతుదారుల ఓట్ల తొలగింపు కోసం బోగస్ సర్వేలు నిర్వహిస్తోందా? ఈ బోగస్ సర్వే రాయుళ్లకు టీడీపీ బడా నేతలకు మధ్య ప్రత్యక్ష సంబంధాలున్నాయా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం చెప్తున్నాయి వైసీపీ శ్రేణులు.
శ్రీకాకుళం జిల్లాలో కొంతమంది యువకులు బోగస్ సర్వే నిర్వహిస్తూ పట్టుబడటం తాజాగా కలకలం సృష్టించింది. జలుమూరు మండలం పెద్దదూగాం, టి.లింగాలుపాడు, నరసన్నపేట మండలం పారిశిల్లి, బసివలస, సుందరాపురం, బాలసీమ గ్రామాల్లో పలువురు యువకులు సర్వే చేస్తుండగా వైఎస్సార్ సీపీ నేతలు ధర్మాన కృష్ణచైతన్య, మూకళ్ల సత్యం, వాన నాగేశ్వరరావు అడ్డగించారు. వారిని పోలీసు స్టేషన్ లో అప్పగించారు. అక్కడ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడమే తమ సర్వే లక్ష్యమని ఆ బృందానికి నేతృత్వం వహిస్తున్న బి.భాస్కర్ విచారణలో అంగీకరించాడు. భాస్కర్ కడప జిల్లావాసి. తమ నేతలు తమకు ట్యాప్ లు ఇచ్చారని, అందులో ఓటర్ల లిస్టు, 18 ప్రశ్నలు ఉంటాయని భాస్కర్ తెలిపాడు.
మీరు టీవీ చూస్తారా? గ్రామంలో ఉన్న సమస్యలు, రాష్ట్ర స్థాయిలో ప్రజా సమస్యలను ఎవరు పరిష్కరిస్తారు? సీఎం పనితీరుపై మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వంతో పోల్చితే ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతిపై మీ అభిప్రాయం? వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడా? రానున్న ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటు వేస్తారు? లాంటి ప్రశ్నలకు తాము ప్రజల నుంచి సమాధానాలు రాబడతామని వెల్లడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాధానాలు చెప్పేవారి ఓట్లను తొలగించాలంటూ తమకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పారు.
తామవారు చాలామంది శ్రీకాకుళం వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తున్నారని భాస్కర్ ఒప్పుకున్నాడు. ఓట్ల తొలగింపు కోసం సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణులను కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి రప్పిస్తున్నట్లు తెలిపాడు. ఒక్కో బూత్ నుంచి 25-50 ఓట్లు, ఒక్కో నియోజకవర్గంలో 10 వేల ఓట్లను తొలగించడమే తమకు అప్పజెప్పిన పని అని వివరించాడు. తమకు తిరుమలేశ్వరరెడ్డి, శ్రీరామ్ రెడ్డి అనే బాస్ లు ఉన్నారని, తమకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే ఫోన్ ద్వారా వారికి సమాచారం చేరవేస్తామని చెప్పారు. వారిద్దరితో అప్పటికప్పుడే ఫోన్ లో మాట్లాడాడు. మీకు వచ్చిన భయం ఏం లేదని, తాము విడిపిస్తామని సర్వే రాయుళ్లకు ఆ ఇద్దరు వెంటనే భరోసా ఇచ్చారు. తమ పార్టీ మద్దతుదారుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా జరుగుతున్న ఈ తంతును వెంటనే అడ్డుకోవాలని పోలీసులకు వైసీపీ నేతలను విజ్ఞప్తి చేశారు.