Begin typing your search above and press return to search.
ఈ వీడియో చూస్తే.. మహిళా నేత విషయంలో బీజేపీ నేత తీరుకు మంట ఖాయం
By: Tupaki Desk | 15 Sep 2022 4:42 AM GMTనాలుగు గోడల మధ్య మహిళా నేతలకు లైంగిక వేధింపులకు పాల్పడే నేతలు పలువురు కనిపిస్తుంటారు. మిగిలిన రంగాల మాదిరే రాజకీయ రంగంలో మగాళ్లు చేసే చిల్లర చేష్టలు అన్ని ఇన్ని కావు. సంప్రదాయానికి పెద్ద పీట వేస్తామని.. నోరు తెరిస్తే చాలు.. భారత్ మాతాకు జై అన్న నినాదంతో పాటు.. మహిళలకు తామిచ్చినంత గౌరవ మర్యాదలు మరెక్కడా ఉండవన్నట్లుగా బిల్డప్పులు ఇవ్వటం చూస్తుంటాం. అవన్నీ నేతి బీరలో నేతి మాదిరే ఉంటాయన్న విషయం తాజాగా బీజేపీకి చెందిన అగ్రనాయకుడు వ్యవహరించిన తీరును చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
అంతేకాదు.. ఈ వీడియోను డీఎంకేకు చెందిననేతలు కట్ చేయించి.. పక్కాగా వైరల్ చేస్తున్న పరిస్థితి. ఇంతకీ సొంత పార్టీ నేత కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురైన బీజేపీ నాయకురాలు మరెవరో కాదు.. శశికళ పుష్ప. ఆమెను టచ్ చేసేందుకు బీజేపీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగానే కాదు.. ఇలాంటి వాళ్లకు తగిన శాస్తి చేయాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.
తమిళనాడుకు చెందిన దళిత నాయకుడు.. స్వాతంత్య్ర సమరయోధుడు ఇమాన్యుయెల్ శేఖరన్ జయంతి కార్యక్రమాన్ని రామనాథ పురం జిల్లాలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ మహిళా నేతలతో పాటు.. పార్టీ నేతలు కూడా హాజరయ్యారు.
పూలదండ వేసే క్రమంలో మహిళా నేతను అదే పనిగా టచ్ చేసేందుకు.. ఆమె చేతిని పట్టుకునేందుకు పలు మార్లు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
ఈ విషయంలో ప్రస్తావించాల్సిన మాట ఇంకోలా ఉంది. అదేమంటే.. పార్టీని.. నేతల్ని బద్నాం చేయటం కోసం ఇలాంటి పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
బీజేపీ నేత బాలగణపతి మీద వచ్చిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు.డీఎంకే దురుద్దేశంతోనే ఈ తరహా వీడియోను ఎడిట్ చేసి.. ప్రజల్లోకి వదిలినట్లుగా చెబుతున్నా.. వీడియోను చూసినప్పుడు మాత్రం.. సదరు మహిళా నేత తీవ్రమైన అసౌకర్యానికి గురి కావటమే కాదు.. అతగాడి చేష్టల్ని ఆమె వ్యతిరేకిస్తూ.. కట్టడి చేసేందుకు శాయ శక్తులా కష్టపడిన వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని చెప్పక తప్పుదు. ఇంతకీ ఈ ఆరోపణలు నిజమో.. అబద్ధమా? అన్నది వీడియోను చూశాక మీరే చెప్పేస్తారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.