Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుకు ఇప్పుడు పెద్ద ప‌రీక్ష‌.. 'సేవ్ ఉత్త‌రాంధ్ర' స‌క్సెస్ అయ్యేనా?

By:  Tupaki Desk   |   13 Oct 2022 9:37 AM GMT
చంద్ర‌బాబుకు ఇప్పుడు పెద్ద ప‌రీక్ష‌.. సేవ్ ఉత్త‌రాంధ్ర స‌క్సెస్ అయ్యేనా?
X
అదేం చిత్ర‌మో కానీ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఒక‌టి త‌ర్వాత‌.. ఒక‌టి ప‌రీక్ష‌లు ఎదుర‌వుతున్నాయి. పార్టీని గాడిలో పెట్ట‌డం.. నాయ‌కుల‌ను ముందుండి న‌డిపించ‌డం.. వ‌ర‌కు ఇప్ప‌టి దాకా.. పెను స‌మ‌స్య‌గా ఉంటే.. ఇప్పుడు.. ఉత్త‌రాంధ్ర ప్రాంతాల్లో పార్టీని నిల‌బెట్టుకోవ‌డం.. వైసీపీని దీటుగా ఎదుర్కొన‌డం .. ఆయ‌న‌కు పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ఒక‌వైపు అధికార పార్టీ వైసీపీ మూడు రాజ‌ధానుల‌తో ముందుకు వెళ్తోంది. విశాఖ‌ను రాజ‌ధాని చేస్తేనే మూడు జిల్లాల ఉత్త‌రాంద్ర‌కు మేలు జ‌రుగుతుంద‌ని.. ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు.

ఈ క్ర‌మంలోనేఎమ్మెల్యే ఒక‌రు రాజీనామా చేశారు(దీనిపై విమ‌ర్శ‌లు వున్నాయి). అయినా.. కూడా ఇది ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లారు. మ‌రోవైపు గ‌ర్జ‌న పేరిట విశాఖ‌లో ఈ నెల 15న పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వ‌హిస్తున్నారు.

ఈ ప‌రిణామాలు.. స‌హ‌జంగానే వైసీపీ దూకుడు పెంచేలా ఉన్నాయ‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. దీనిని దీటుగా ఎద‌ర్కొని.. మూడు రాజ‌ధానులు కాదు.. ఏకైక రాజ‌ధానితోనే రాష్ట్రం డెవ‌ల‌ప్ అవుతుంద‌ని..చెప్పాల్సిన అవ‌స‌రం టీడీపీకి ఏర్ప‌డింది.

అదేస‌మ‌యంలో విశాఖ‌ను రాజ‌ధానిగా చేయ‌క‌పోయినా.. ఉత్త‌రాంద్ర‌ను ఎలా అభివృద్ధి చేస్తామ‌నేది కూడా.. చంద్ర‌బాబు చెప్పాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. ఈ ప‌రిణామాల‌తోనే టీడీపీ నేత‌లకు ప్ర‌జ‌లు ప్ల‌స్ మార్కులు వేస్తారో లేదో తెలుస్తుంది.

మ‌రోవైపు.. ఉత్త‌రాంధ్ర ప‌రిస్తితి చూస్తే.. కొంద‌రు నాయ‌కులు మాత్ర‌మే పార్టీ యాక్టివ్‌గా ఉన్నార‌ని.. చంద్ర‌బాబు త‌ల‌పోస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోఓడిన వారు.. ఇప్పుడు పార్టీ దిశ‌గా.. బ‌లోపేతం చేసేందుకు ఉత్సాహం చూపించ‌డం లేదు.

దీంతో ఈ నెల 19 త‌ర్వాత‌.. నేరుగా చంద్ర‌బాబు విశాఖ‌లోనే మ‌కాం వేయాల‌ని నిర్ణ‌యించ‌డం.. మంచి ప‌రిణామ‌మే.అయితే.. ఇది స‌క్సెస్ అవుతుందా? నిద్ర న‌టిస్తున్న నాయ‌కుల‌ను ఆయ‌న ఏమేర‌కు త‌ట్టి లేప‌గ‌ల‌రు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఎలా చూసుకున్నా.. మూడు రాజ‌ధానుల విష‌యంలో కోస్తా, సీమ‌ల్లో వైసీపీ నాయ‌కులు స్పంందించిన దానికి చాలా వ‌ర‌కు భిన్నంగా.. ఉత్త‌రాంధ్ర మంత్రులు.. నేత‌లు స్పందిస్తున్నారు. వారికి దూకుడుకు క‌ట్ట‌డి వేసి.. టీడీపీని నిల‌బెట్టి త‌మ వాద‌న‌ను బ‌లోపేతం చేసుకోవాల్సిన అవ‌స‌రం చంద్ర‌బాబు కు ఉంద‌నేది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట. మ‌రి ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.