Begin typing your search above and press return to search.

హైపవర్ కమిటీ జీవోలో కీలక ట్విస్ట్..ఇదే

By:  Tupaki Desk   |   29 Dec 2019 10:04 AM GMT
హైపవర్ కమిటీ జీవోలో కీలక ట్విస్ట్..ఇదే
X
కొద్ది సేపటి క్రితమే ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ చైర్మన్ గా ఏపీ సీఎస్ నీలం సాహ్ని కన్వీనర్ గా రాజధానిపై హైపవర్ కమిటీని జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీకి 3 రాజధానులు.. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడానికి ఈ హైపవర్ కమిటీ ఏర్పాటు చేశారని అంతా భావించారు. అయితే ప్రభుత్వం జీవోను తరిచిచూస్తే అందులో ఎక్కడా రాజధాని అనే పదాన్నే ఏపీ ప్రభుత్వం ప్రస్తావించకపోవడం చర్చనీయాంశమవుతోంది.

కేవలం అభివృద్ధి వికేంద్రీకరణ మీద రెండు నివేదికలను హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తుందని మాత్రమే జీవోలో స్పష్టం చేశారు. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ నివేదికలను పరిశీలించి తుది నివేదికను ఇస్తుందని పేర్కొంది.

దీన్ని బట్టి రాజధాని తరలింపులో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా జగన్ సర్కారు ముందు జాగ్రత్త చర్యగా హైపవర్ కమిటీని కేవలం అభివృద్ధి వికేంద్రీకరణపైనే నియామకం చేసినట్టు అర్థమవుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

రాజధాని అని మెన్షన్ చేయకుండా కేవలం అభివృద్ధి వికేంద్రీకరణ కోసమేనని.. మూడు రాజధానుల వ్యవహారాన్ని జీవోలో పేర్కొనకపోవడం చర్చనీయాంశంగా మారింది.