Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ షో కు షాక్..: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   30 April 2022 6:11 AM GMT
బిగ్ బాస్ షో కు షాక్..: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X
బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న బిగ్ బాస్ రియాల్టీ షో పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రియాలిటీ షోలు సమాజానికి మంచి నేర్పాలని, ఈ షో తో యువత చెడుదారిలో వెళ్తోందని తెలిపింది.

అసభ్య పదజాలం వాడుతూ అశ్లీల ప్రదర్శన ఎక్కువవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ షో పై 2019లో పిటిషన్ ధాఖలైంది. అయితే అప్పటి నుంచి ఈ పిటిషన్ పై విచారణ జరగలేదు. తాజాగా ఈ పిల్ పై ఏపీ హైకోర్టు స్పందించింది. దీనిపై సోమవారం పూర్తిస్థాయిలో విచారిస్తామని జస్టిస్ అసమద్దీన్ అమానుల్లా, జస్టిస్ టి.రాజశేఖరరావుతో కూడిన ధర్మాసం తెలిపింది. అంతేకాకుండా ఈ పిటషన్ వేసిన వారిని హైకోర్టు అభినందించింది.

టీవీ షోల్లో అత్యధిక ప్రేక్షకాదరణ పొంది ప్రొగ్రాం ఏదంటే బిగ్ బాస్ చెప్పుకోవచ్చు. ఎపిసోడ్ల వారీగా ఈ షో ను ఓచానెల్ లో ప్రసారం చేస్తున్నారు. అయితే ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి మాత్రమే అని చెప్పిన నిర్వాహకులు హద్దు మీరుతున్నారని కొందరు విమర్శలు చేశారు. ఈ షోను చిన్న పిల్లలు కూడా ఎక్కువగా వీక్షిస్తున్నారని, దీంతో వారు చెడిపోయే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరించారు. కానీ నిర్వాహకులు మాత్రం యువతను ఆకర్షించేలా పలు గేమ్స్ ఆడిపిస్తూ వినోదాన్ని పంచుతున్నారు. అయితే అప్పుడప్పుడు రొమాన్స్ సీన్స్ కూడా ప్రసారం చేయడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇక చాలా మంది మహిళలు సీరియళ్లు వదిలి ఈ షోకు కనెక్టయ్యారన్న వాదనలు వినిపించాయి. దీంతో షోను అనుకరించి ఇంట్లో గొడవలు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని ఆరోపించారు. అయితే విమర్శకుల వాదనలను చాలా మంది కొట్టిపారేశారు. ఈ షో కేవలం వినోదాన్ని పంచడానికి మాత్రమేనని ఇందులో ఎటువంటి అభ్యంతరకర ప్రదర్శనలు లేవని అన్నారు. కానీ తాజాగా ఈ విషయంపై హైకోర్టు స్పందించడంపై చర్చనీయాంశంగా మారింది.

2019లో జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి వేసిన పిటిషన్ పు తాజాగా ఏపీ హైకోర్టు స్పందించింది. బిగ్ బాస్ రియాలిటీ షో వల్ల యువత పెడదారి పడుతోంది, ఇందులో ఎక్కువగా అశ్లీల ప్రదర్శన చేస్తున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ వంటి రియాలిటీ షో వల్ల సమాజం దెబ్బతింటోందన్నారు. ఈ మేరకు జస్టిస్ అసమద్దీన్ అమానుల్లా, జస్టిస్ టి.రాజశేఖరరావుతో కూడిన ధర్మాసం తెలిపింది. మా పిల్లలు బాగున్నారు. ఇలాంటి షోతో మాకేం పని అని ప్రజలు అనుకుంటే సరిపోదని, భవిష్యత్ లో సమస్య ఎదురైనప్పుడు కూడా పట్టించుకోరని కోర్టు తెలిపింది. సోమవారం ఈ పిటిషన్ పై పూర్తిస్థాయి విచారణ చేపడుతామని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.