Begin typing your search above and press return to search.

భూమికి ఎంత పే..ద్ద గండం గ‌డిచిందంటే..

By:  Tupaki Desk   |   4 Sep 2017 8:21 AM GMT
భూమికి ఎంత పే..ద్ద గండం గ‌డిచిందంటే..
X
ఈ శ‌నివారం మీరేం చేశారు? ఎప్ప‌టిలానే వీకెండ్ లో బిజీబిజీగా గ‌డిపేశామ‌న్న మాట చెప్పే వాళ్లే ఎక్కువ‌గా ఉంటారు. మ‌నం మ‌న ప‌నిలో ఉన్న వేళ‌లో నాసా శాస్త్ర‌వేత్త‌లు ఊపిరి బిగ‌పట్టి ఏం జ‌రుగుతుందోన‌న్న భ‌యాందోళ‌న‌లో ఉన్న‌ట్లుగా చెప్పాలి.

ఎందుకంటే.. ఒక ఘోర ప్ర‌మాదం భూమికి ముంచుకొస్తున్న వేళ‌.. దాని నుంచి భూమి ఏ విధంగా త‌ప్పించుకుంటుంద‌న్న టెన్ష‌న్ లో శాస్త్ర‌వేత్త‌లు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఇంత‌కీ ఆ పెను ప్ర‌మాదం ఏమిటి? అదెలా త‌ప్పింది? ప్ర‌పంచ మాన‌వాళిని తీవ్రంగా ప్ర‌భావితం చేసే ఈ ప్ర‌మాదం గురించి నిపుణులు ఇప్పుడు నోరు విప్పుతుంటే హార్ట్ బీట్ ఒక్క‌సారి పెర‌గ‌టం ఖాయం.

ఇంత‌కూ భూమికి తృటిలో త‌ప్పిన పెను ప్ర‌మాదం ఏమిటంటే.. అంత‌రిక్షంలో భూ క‌క్ష‌కు చేరువగా తిరుగుతున్న ఫ్లోరెన్స్ అనే ఉల్క భూమికి అతి స‌మీపంలోకి వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. ఫ్లోరెన్స్ తో పాటు దాని క‌క్ష్య‌లో ఉన్న రెండు చంద్రులు కూడా భూమికి అతి చేరువుగా వ‌చ్చిన‌ట్లుగా నాసా వెల్ల‌డించింది. భూమికి 4.4 మిలియ‌న్ మైళ్ల దూరం నుంచి ఈ ఉల్క వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. 1890 నుంచి ఈ ఉల్క భూమికి ద‌గ్గ‌ర‌గా వ‌స్తోంది.

శ‌నివారం ఇది భూమికి అత్యంత చేరువుగా వ‌చ్చి వెళ్లిపోయిన‌ట్లుగా నాసా శాస్త్ర‌వేత్త‌లు క‌న్ఫ‌ర్మ్ చేస్తున్నారు. ఈ ఉల్క సైజు 30 ఈజిప్టు పిర‌మిడ్ల సైజుకు స‌మానంగా.. మ‌రింత స్ప‌ష్టంగా చెప్పాలంటే మూడు మైళ్ల వ్యాసార్థంలో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ ఉల్క‌ను 1981లో తొలిసారి అంత‌రిక్ష ప‌రిశోధ‌కులు గుర్తించారు.

ఫ్లోరెన్స్ నైటింగేల్ పేరు మీదుగా ఫ్లోరెన్స్ ఆస్ట్రరాయిడ్ అని పేరు పెట్టారు. తాజాగా అతి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన ఈ ఉల్క మ‌ళ్లీ 2500 సంవ‌త్స‌రాల త‌ర్వాతే మ‌ళ్లీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ప్ర‌తి 2500 సంవ‌త్స‌రాల‌కు ఒక్క‌సారి భూమికి ద‌గ్గ‌ర‌గా వ‌స్తుంద‌ని నాసా శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. కేవ‌లం ప‌ది ల‌క్ష‌ల సంవ‌త్స‌రాల‌కు ఒక్క‌సారి మాత్ర‌మే మాన‌వ మ‌నుగ‌డ‌కు ముప్పు వాటిల్లేంత పెద్ద ఉల్క భూమిని ఢీకొడుతుంద‌ని చెబుతున్నారు. గ‌త ఏడాది కారు సైజులో ఉన్న ఒక ఉల్క భూమి వైపు దూసుకొచ్చింది. అయితే.. ఇది భూ వాతావ‌ర‌ణంలో ప్ర‌వేశించ‌టంతో వాయు రాపిడితో భూమిని ఢీ కొట్టే లోపే మండిపోయింది. ఈ గండం త‌ప్పింద‌ని భావిస్తున్నంత‌లో తాజాగా మ‌రో మ‌ప్పు భూమికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి వెళ్లటం ఇప్పుడు అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.