Begin typing your search above and press return to search.

బాబు గింజుకున్నా ప్ర‌యోజ‌నం నిల్‌... వీక్‌నెస్ త‌మ్ముళ్లకు తెలుసు...!

By:  Tupaki Desk   |   13 Dec 2021 4:52 AM GMT
బాబు గింజుకున్నా ప్ర‌యోజ‌నం నిల్‌... వీక్‌నెస్ త‌మ్ముళ్లకు తెలుసు...!
X
టీడీపీలో ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. పార్టీలో స‌మూల మార్పులు తెస్తా.. ప్ర‌క్షాళ‌న చేస్తా.. అంటూ.. ప‌దే ప‌దే చెబుతున్న చంద్ర‌బాబు.. ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది ఏమైనా ఉందా? అంటే..నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు చోటా నేత‌ల‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. ఈ రెండున్న‌రేళ్ల కాలంలో చంద్ర‌బాబు తీసు కున్న అతి పెద్ద నిర్ణ‌యం ఇదే న‌ట.

ఇదే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యం కంటే..కూడా ఆయ‌నకు ఉన్న వీక్‌నెస్‌పైనే త‌మ్ముళ్లు చ‌ర్చించుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారు.. ఇలా అయితే.. ప్ర‌యోజ‌నం ఏం ఉంటుంద‌ని అంటున్నారు.

వాస్త‌వానికి టీడీపీలో గ‌త రెండున్న‌ర సంవ‌త్స‌రాలుగా ఏం జ‌రుగుతోందో.. అంద‌రికీ తెలిసిందే. ఎక్క‌డిక క్కడ పార్టీ నేతలు ఉదాసీనంగా ఉన్నారు. న‌చ్చితే.. పార్టీలో ప‌నిచేస్తున్నారు. లేక‌పోతే.. మౌనంగా ఉంటు న్నారు.

ఇంకా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే పొరుగు రాష్ట్రాల‌లో ఉంటూ.. ప‌నులు చూసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో స‌హ‌జంగానే పార్టీ ఇబ్బందిలో ఉంది. స్తానిక ఎన్నిక‌ల్లోనూ స‌త్తా చూపించ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది. స‌త్తా చూపించిన ద‌ర్శి, కొండ‌ప‌ల్లి వంటి చోట్ల పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది. లేని చోట చేతులు ఎత్తేసింది.

ఇలాంటి ప‌రిస్థితిని గ‌మ‌నిస్తున్న చంద్ర‌బాబుకు స‌హ‌జంగానే క‌డుపు ర‌గిలిపోతోంది. పార్టీలో ప‌నులు చేయించుకున్న‌వారు.. పార్టీ క‌ష్టాల్లో ఉంటే.. ఇప్పుడు బ‌జారున ప‌డేసి పోవ‌డాన్ని ఆయ‌న జీర్ణించుకోలేక పోతున్నారు.

ఈ క్ర‌మంలోనే ప్ర‌క్షాళ‌న పేరుతో హ‌డావుడి చేస్తున్నారు. అయితే.. చంద్ర‌బాబు పైకి ఎన్ని హెచ్చ‌రిక‌లు చేసినా.. స‌మ‌యానికి త‌మ అవ‌స‌రం వ‌స్తే.. ఆయ‌నే దిగి వ‌స్తారు.. అనే విష‌యం త‌మ్ముళ్ల మ‌ధ్య హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేస‌మ‌యంలో ఎవ‌రు స‌ల‌హాలు ఇచ్చినా.. ఆయ‌న స్వీక‌రించ‌రు.

పైగా.. తాను చెప్పిందే చేయాలనే టైపు.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఇదే జ‌రిగింద‌ని.. ఇక‌పైనా ఇలాంటి ప‌రిణామ‌మే ఉంటుంద‌ని అంటున్నారు. ఇదే చంద్ర‌బాబు వీక్ నెస్ అని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో నే చంద్ర‌బాబు ఆదేశాల‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేకుండా పోయింద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.