Begin typing your search above and press return to search.
ఆఫ్ఘన్‌లో అమెరికా చేసిన అతి పెద్ద పొరపాటు ఇదే !
By: Tupaki Desk | 19 Aug 2021 2:30 PM GMTఆఫ్గనిస్తాన్..ప్రస్తుతం ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఆఫ్ఘన్ లో పరిస్థితులు తలక్రిందులు అయ్యాయి. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ల రాజ్యం కొనసాగుతుంది. తాలిబన్లు.. అఫ్ఘాన్ మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారు. అఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వం త్వరలో ఏర్పడుతుందని కూడా ప్రకటించారు. తాలిబన్లకు లొంగిపోయి అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. దీంతో అఫ్ఘాన్ కొత్త ప్రెసిడెంట్ గా తాలిబన్ కోఫౌండర్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ను త్వరలోనే అఫ్ఘాన్ ప్రెసిడెంట్ గా తాలిబన్లు ప్రకటించనున్నారు.
సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఆల్ ఖైదాను, దానికి ఆశ్రయం కల్పించిన తాలిబన్లను మట్టుబెట్టే లక్ష్యంతో ఆఫ్ఘనిస్థాన్ లో 2001లో సైనిక చర్యకు దిగింది అమెరికా. కానీ అగ్రరాజ్య సేనలు వీడగానే మొత్తం తాలిబన్లు శరవేగంగా ఆఫ్ఘన్ ను కైవసం చేసుకున్నారు. ఈ తరుణంలో అమెరికా తన పాత్ర గురించి ఆత్మ పరిశోధన చేసుకోవాల్సి ఉంది. 46 ఏండ్ల క్రితం వియత్నాంలోని కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైనిక చర్యకు దిగిన అమెరికా 1975లో సైగోన్ లో ఘోర పరాజయం పాలైంది. ఆఫ్ఘన్ పై తిరిగి తాలిబన్లు పట్టు సాధించడంతో అగ్రరాజ్య శిబిరంలో నిరాశా నిస్ప్రుహలు చోటు చేసుకున్నాయి. 9/11 ఉగ్రదాడులకు అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ దే బాధ్యత.
ఆఫ్ఘన్ భూభాగంపై నుంచి దాడులు చేశారన్న ఆగ్రహంతో 2001లో ఆఫ్ఘన్‌లో అడుగు పెట్టింది అమెరికా.. ఉగ్రవాద సంస్థ, దానికి ఆశ్రయం కల్పించిన ఆఫ్ఘన్ తాలిబన్ సర్కార్ ను శిక్షించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. కానీ అగ్రరాజ్యం నేరుగా ముందుకు సాగలేదన్న విమర్శ ఉంది. తాలిబన్లను కట్టడి చేశాక జాతి నిర్మాణం, మహిళలకు విముక్తి కల్పన లక్ష్యాలు జత కలిశాయి. ఆఫ్ఘనిస్తానీయులు పూర్తిగా పశుపోషణపై ఆధారపడి జీవించేవారు. అంతే కాదు మెజారిటీ జనాభా పురాతన కాలపు ఆంక్షల మధ్య నివసించే వారు. వారిలో లింగ సమానత్వం, చట్టాల పట్ల గౌరవం, మానవ హక్కుల పరిరక్షణతో కూడిన ప్రజాస్వామ్యం పట్ల ఎలా పరివర్తన తీసుకు రాగలరన్నది సందేహంగా ఉంది. నెపోలియన్ విదేశీ మంత్రి చార్లెస్ మారైస్ డీ తల్లేర్యాండ్ పెరిగోడ్ మాటల్లో చెప్పాలంటే ఆఫ్ఘన్‌లో అమెరికా చర్యలు నేరాల కంటే దారుణం.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లను కట్టడి చేయడానికి పాకిస్థాన్‌తో అమెరికా డీల్ కుదుర్చుకున్నది. కానీ అమెరికా ప్లాన్ కనుగుణంగా పాకిస్థాన్ వ్యవహరించలేదు. అమెరికా డిమాండ్లపై పాకిస్థాన్ సైనిక జనరల్స్ తమకంటూ ద్వేషపూరిత ప్రణాళిక అమలు చేశారు. 9/11 దాడులు జరిగిన మూడు నెలల్లోపే భారత్ పార్లమెంట్ పై పాక్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులు దాడులు చేయగలిగారు. భారత్ సరిహద్దుల్లో సంక్షోభాన్ని నివారించగలిగి ఉంటే.. పాక్ తన సైన్యం మద్దతుతో ఆఫ్ఘన్‌లో అమెరికా లక్ష్యాల సాధనకు అండగా నిలిచేదన్న అభిప్రాయం.
జాతి నిర్మాణం పేరిట కొన్నేండ్ల తరబడి ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా సేనలు తిష్ఠ వేయడం మరో తప్పిదం. అమెరికా మిత్రదేశంగా ఉన్న పాకిస్థాన్.. తన శక్తియుక్తులన్నీ భారత్ కు వ్యతిరేకంగా పోరాడటానికే ఉపయోగించింది.
దీని ప్రభావం ఆఫ్ఘన్‌లో అమెరికా సేనలకు ప్రతికూల పరిణామాలకు దారి తీసింది. ఆఫ్ఘన్ లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పూర్తిగా పాక్ పైనే అమెరికా ఆధారపడటం మొదటికే మోసానికి కారణమైంది. తాలిబన్లను ఏరివేయడమే లక్ష్యంగా అమెరికా పని చేసిందే తప్ప, దానికి పాక్ లో మూలాలు ఉన్నాయన్న సంగతిని పూర్తిగా పక్కన పెట్టేసింది. పాక్ మిలిటరీ అకాడమీకి కూతవేటు దూరంలో దాక్కుకున్న ఒసామాబిన్ లాడెన్ ను హతమార్చిన అమెరికా ,పాక్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
అఫ్గన్ లో పరిస్థితులను మెరుగు పర్చగల సామర్థ్యం ఉన్న వారిని కాకుండా హమీద్ కర్జాయి, అశ్రఫ్ ఘనీ వంటి నేతలను నాయకులుగా నిలబెట్టి మరో పెద్ద పొరపాటు చేసింది. అసలు వారిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయా, లేదా అనే విషయాన్ని కూడా గమనించలేదు. నిత్యం ఉగ్రవాదం అక్కడే దేశంలో పాలన ఎలా సాగించాలంటే నాయకుడి పాత్ర చాలా ముఖ్యం. ఇందులోను అమెరికా విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. నిత్యం ఉగ్రవాదంతో అట్టుడుకుతున్న దేశంలో పాలన ఎలా సాగించాలన్న వ్యూహం, క్లూ గానీ లేవు. స్వీయ భ్రమలతోపాటు బలగాల్లో పునరుత్తేజం నింపడంలో విఫలమైన దరిమిలా, అమెరికా ఓటమి పాలైందన్న విమర్శలు ఉన్నాయి.