Begin typing your search above and press return to search.
షాక్: కరోనాతో ఆ ఎమ్మెల్సీ మృతి
By: Tupaki Desk | 22 July 2020 9:00 AM ISTహడలెత్తిస్తున్న కరోనా నిత్యం వేలాది మంది పాజిటివ్ కావటం చూస్తున్నదే. అందులో ఎక్కువమంది రికవరీ అవుతున్నారు. దీంతో.. ఈ మాయదారి రోగం వచ్చినా పెద్ద సమస్యలేమీ రావన్న తప్పుడు ఆలోచనలో ఉన్నోళ్లకు కొదవలేదు. కోలుకునే వారు కోలుకుంటున్నా.. కొంతమంది మాత్రం అనూహ్యంగా మరణిస్తున్నారు. అప్పటివరకూ బాగానే ఉండి.. ఉన్నట్లుండి శ్వాస ఆడక కొందరు విలవిలలాడుతూ మృత్యువాత పడుతున్న వారికి కొదవ లేదు. కరోనాకు ఏ మాత్రం కనికరం లేదన్న విషయంలో అందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
తాజాగా దీని బారిన పడిన ఒక ఎమ్మెల్సీ మృతి చెందిన వైనం షాకింగ్ గా మారింది. డబ్బులు ఖర్చు పెట్టే వీలుండి.. చేతిలో అధికారం ఉన్నప్పటికీ కరోనా యుద్ధంలో ఆ రాజకీయ నేత ఓడిపోయాడు. ఈ విషాదం బిహార్ లో చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో పలువురు రాజకీయ నేతలు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. మొన్నటికి మొన్న పశ్చిమబెంగాల్ లోని అధికార టీఎంసీ ఎమ్మెల్యే తమోనాశ్ ఘోష్ కరోనా బారిన పడి మరణించగా.. తాజాగా బిహార్ లోని బీజేపీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
కొద్దిరోజులుగా కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు చేసిన వైద్యానికి ఎమ్మెల్సీ కోలుకున్నట్లే కనిపించారని.. ఒక్కసారిగా గుండెపోటు రావటంతో ఆయన మృత్యువాత పడినట్లుగా వైద్యులు చెబుతున్నారు. ఆయన మరణం బిహార్ రాజకీయాల్లో విషాదం నెలకొంది. కరోనా అంటే అప్పటివరకూ పెద్దగా పట్టించుకోని వారు సైతం ఇప్పుడు హడలిపోతున్నారు. తాజాగా విషాదంపై రాష్ట్ర సీఎం సంతాపటం ప్రకటించారు. ఫోన్ ద్వారా సునీల్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు ముఖ్యమంత్రి నితీశ్. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో నలుగురు ఎమ్మెల్యేలకు.. శాసనమండలి ఛైర్మన్ కూడా పాజిటివ్ బారిన పడి చికిత్స పొందుతున్నారు.