Begin typing your search above and press return to search.
డ్రాగన్ దేశానికి నితీశ్ అంతలా దెబ్బేయటానికి రీజన్ ఇదే!
By: Tupaki Desk | 29 Jun 2020 5:00 AM GMTయావత్ దేశమంతా తీవ్రమైన భావోద్వేగం నడుస్తోంది. ఓపక్క దేశ ప్రజలంతా మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. చైనా తీరుపై తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తమను కెలికిన చైనా సైనికులకు మన సైనికులు దిమ్మ తిరిగేలా షాకిచ్చినా.. ఆ క్రమంలో ఇరవైమంది వరకూ ప్రాణాలు కోల్పోవటం భారతీయులకు మింగుడుపడని పరిస్థితి. దాదాపు నలభై మంది వరకూ డ్రాగన్ సైనికులను ముట్టు పెట్టి.. మీరు ఒకటిస్తే.. మేం రెండు ఇవ్వగలమన్న సందేశాన్ని మన వీర సైనికులు ఇచ్చారని చెప్పాలి.
గాల్వామా ఉదంతం నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర సర్కారు.. చైనాతో కాంటాక్టుకు చెల్లుచీటి ఇచ్చేశారు. తాజాగా అదే బాటలో నడిచారు బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. తన రాష్ట్ర రాజధాని పాట్నాలో నిర్మించాల్సిన మహాత్మాగాంధీ వంతెనకు గతంలో ఇచ్చిన కాంటాక్టును రద్దు చేస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. వంతెన నిర్మిస్తున్న కాంట్రాక్టర్ కు చైనాకు చెందిన రెండు కంపెనీలతో లింకులు ఉండటంతో ఇంత తీవ్ర నిర్ణయాన్ని తీసుకోవటానికి ఆయన వెనుకాడలేదు.
తమ టెండర్లు కావలాంటే చైనా కంపెనీతో తెగ తెంపులు చేసుకోవాలన్న మాటను చెప్పినప్పటికీ.. సదరు సంస్థ తన తీరును మార్చుకోకపోవటంతో.. వారికివ్వాల్సిన టెండర్లను రద్దు చేసినట్లుగా తాజాగా ప్రకటించిన అందరి చూపు తన మీద పడేలా చేసుకున్నారు.
ఇంతకీ చైనా బలగాలు చేసిన దాడిపై మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రుల కంటే నితీశ్ అంత ఘాటుగా ఎందుకు రియాక్టు అయినట్లు? అన్న సందేహం కలిగిందా? అక్కడికే వస్తున్నాం. చైనా చేసిన దుర్మార్గపు దాడిలో మరణించిన సైనికుల్లో ఐదుగురు బిహార్ రాష్ట్రానికి చెందిన వారు కావటంతో నితీశ్ కు తీవ్రమైన కోపం వచ్చింది. తన తాజా నిర్ణయంతో డ్రాగన్ దేశానికి చురుకు పుట్టించేలా చేయటమే ఆయన ఉద్దేశంగా చెబుతున్నారు. తాజాగా మారిన సమీకరణాల నేపథ్యంలో చైనాకు షాకిచ్చే నిర్ణయంతో రాష్ట్ర ప్రజల మనసుల్ని దోచేశారని చెప్పక తప్పదు.