Begin typing your search above and press return to search.
సినిమాటిక్ సర్ ప్రైజ్ ఇచ్చిన ఆ రాష్ట్ర సీఎం
By: Tupaki Desk | 25 Nov 2017 4:33 AM GMTఆదర్శాలు వల్లించటం వేరు.. వాటిని ఆచరించటం వేరు. మాటలు చెప్పినంత ఈజీ కాదు ఆదర్శాల్ని అమలు చేయటం. ఆదర్శానికి నిలువెత్తు రూపంగా నిలిచిన వారి మనసుల్ని దోచుకునేలా చేసిన ఒక కొత్త జంటకు సినిమాటిక్ షాకిచ్చారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్.
తానిచ్చిన పిలుపునకు స్పందించిన వారికి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వటంతో పాటు.. తాను మొదలెట్టిన వరకట్న వ్యతిరేక ప్రచారానికి మరింత ఉత్సాహాన్ని పెంచేలా నితీశ్ వ్యవహరిస్తున్నారు. ఊహించని రీతిలో రియాక్ట్ అవుతున్న ఆయన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొద్ది నెలల క్రితం వరకట్నం.. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడాలంటూ పిలుపునిచ్చారు.
నితీశ్ నోటి నుంచి ఈ పిలుపుపై పలువురు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇదే తీరులో తాజాగా బిహార్ రాష్ట్ర రాజధాని పాట్నాకు చెందిన సంజిత్ కుమార్.. తానున్న ప్రాంతానికి చెందిన జాహి కుమారి అనే మహిళను కట్నం తీసుకోకుండా మతాంతర వివాహం చేసుకున్నారు. తన పెళ్లికి స్ఫూర్తి ముఖ్యమంత్రేనని అతగాడు వెల్లడించాడు.
సహజంగానే ఈ వార్త మీడియాలో వచ్చింది. ఇక్కటే అసలు విషయం మొదలైంది. తన మాటకు స్పందించి.. ఆదర్శ వివాహాం చేసుకున్న అతడికి స్వీట్ షాకిచ్చే ప్రయత్నం చేశారు సీఎం నితీశ్. వారి వివాహం గురించి తెలుసుకున్న ఆయన పూల బొకే తీసుకొని స్వయంగా వారి వద్దకు వెళ్లి గ్రీటింగ్స్ చెప్పారు. కట్నం గురించి.. మతం గురించి ఆలోచించకుండా పెళ్లి చేసుకోవటాన్ని అభినందించారు. ముఖ్యమంత్రి నుంచి ఇలాంటి స్పందన వస్తుందని ఊహించని సదరు పెళ్లి కుమారుడు షాక్‌కు గురైతే.. ఈ సినిమాటిక్ ఉదంతం బిహార్ వాసులతో పాటు.. పలు రాష్ట్రాల వారి మనసుల్ని దోచుకునేలా చేసింది. ఆలస్యమెందుకు.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలాంటి స్వీట్ షాకులిస్తే మరింత మైలేజీ పెరగటం ఖాయం.