Begin typing your search above and press return to search.
పీకే బీజేపీ తొత్తు...నితీష్ షాకింగ్ కామెంట్లు
By: Tupaki Desk | 8 Oct 2022 4:40 PM GMTప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే... ఐప్యాక్ అధినేతగా దేశ రాజకీయాల్లో ఎందరో ముఖ్యమంత్రలను ఆ పీఠంపై కూర్చోబెట్టిన ఘనత పీకేది. 2014లో ప్రధాని మోడీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ లు అధికారం చేపట్టడంలో పీకేదే కీలకపాత్ర అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత ఏపీ సీఎం జగన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ల విజయం వెనుక కూడా పీకే హస్తం ఉంది.
అయితే, కొద్దిరోజుల క్రితం ప్రధాని మోడీపై వార్ ప్రకటించిన పీకే కాంగ్రెస్ తో కలిసి బీజేపీ వ్యతిరేక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నించారు. కానీ, హస్తం పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో ఆ పార్టీపై విమర్శలు గుప్పించిన పీకే...తన సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తన సొంత రాష్ట్రం బీహార్ ను అభివృద్ధి చేసేందుకు పీకే పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పీకే చేస్తున్న వ్యాఖ్యలు బీహార్లో రాజకీయ దుమారం రేపుతున్నాయి.
మళ్లీ జేడీయూలో చేరితే తనకు కీలక పదవి ఇస్తానని నితీష్ కుమార్ ఆఫర్ ఇచ్చారంటూ పీకే చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. ఈ క్రమంలోనే పీకే వ్యాఖ్యలపై స్పందించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని నాలుగైదు సంవత్సరాల క్రితమే పీకే సలహా ఇచ్చాడని, కానీ, తాను ఆ పని చేయలేదని నితీష్ చెప్పారు. పీకే గతంలో బీజేపీ కోసం పని చేశారని, ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీ తరపున తొత్తుగా వ్యవహరిస్తున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు.
సొంత ఎజెండా అంటూ లేని పీకే..బీజేపీ ఎజెండాను మోసుకు తిరుగుతున్నాడని నితీష్ విమర్శలు గుప్పించారు. మాట్లాడే అధికారం ఆయనకు ఉందని, కానీ నోటికి వచ్చినట్లు విమర్శలు, ఆరోపణలు చేస్తే సహించేది లేదని బీహార్ సీఎం వార్నింగ్ ఇచ్చారు. జేడీయూలో చేరితే కీలక పదవి ఇస్తానని తాను పీకేకు హామీ ఇవ్వలేదని, ఇలాంటి అవాస్తవ ప్రకటనలతో ప్రజలను పీకే మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.
ఇటువంటి ప్రకటనలతో తన ప్రభుత్వం పై పీకే లేనిపోని అపోహలను కల్పిస్తున్నారని మండిపడ్డారు. తాను ఎన్నో పాదయాత్రలను చూశానని, పీకే పాదయాత్రపై స్పందించాల్సిన అవసరం లేదని నితీష్ తేల్చి చెప్పారు. అంతేకాదు, పీకేతో తనకు ఎలాంటి లావాదేవీలు లేవని క్లారిటీ ఇచ్చారు. నితీష్ కామెంట్లపై పీకే స్పందన ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.