Begin typing your search above and press return to search.
నితీష్ దెబ్బకు మోడీ అబ్బా... జగన్ జారిపొతారా... ఏంటి కధ...?
By: Tupaki Desk | 10 Aug 2022 8:53 AM GMTఅన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఎవరైనా దేవుళ్ళే. పొలిటికల్ లీడర్స్ సక్సెస్ ని చూసి అపర చాణక్యుడు అని అంటారు కానీ అంతటి చాణక్యుడు కూడా నంద రాజుల మీద అంత సులువుగా ఒకేసారి విజయం సాధించలేదు. ఆయనకూ ఓటములు ఉన్నాయి. మరి అపర చాణక్యం బీజేపీ పెద్దలది అని మురిసిపోయి మహారాష్ట్రలో కుర్చీని లాగేసుకుంటే బీహార్ లో బొక్క బోర్లా పడ్డారు. సీనియర్ మోస్ట్ నేత నితీష్ కుమార్ సరైన టైమ్ లో మోడీ షా టీం ని దెబ్బ తీసి తన టాలెంట్ ఏంటో కాషాయ దళానికి చక్కగా రుచి చూపించారు.
ఈ దెబ్బతో బీజేపీకి దేశంలో ఉన్న 18 రాష్ట్రాలలో ఒక రాష్ట్రం చేజారింది. అంతే కాదు, కొత్త తలనొప్పులు కూడా ఎదురవుతున్నాయి. అవెలా అంటే రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ ఈ రోజుకీ లేదు. అక్కడ ఈ రోజున మొత్తం సభ్యులు 237 మంది ఉంటే మెజారిటీ రావాలంటే 119 మంది ఉండాలి. అయితే బీజేపీ సహా ఎన్డీయే కూటమికి 115 మంది మాత్రమే ఎంపీలు ఉన్నారు.
ఇందులో జేడీయూకి చెందిన వారు అయిదురుగు రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. వీరిలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కూడా ఉన్నారు. ఈ నంబర్ ఇపుడు బీజేపీకి టోకున పడిపోయింది. అంటే 119 మందిలో 110 మాత్రమే ఆ పార్టీకి ఉన్నారు. ఇక త్వరలో కొన్ని ఖాళీలు ఏర్పడి మరో నాలుగు సీట్లు బీజేపీకి దక్కినా కూడా రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 241కి పెరుగుతుది. అపుడు మెజారిటీ 121 ఉంటేనే కానీ కుదరదు. ఆ విధంగా చూసుకున్నా మరో ఏడుగురు మెంబర్స్ బీజేపీకి తక్కువ పడతారు.
ఇక అక్టోబర్ తరువాత రాజ్యసభలో పూర్తి మెజారిటీ వస్తే కీలకమైన బిల్లులను ప్రవేశ్పెట్టాలని బీజేపీ రెడీ అవుతోంది. దాని కోసం తెర వెనక కసరత్తు కూడా సాగుతోంది. అయితే సడెన్ గా నితీష్ ఇచ్చిన బిగ్ షాట్ తో బీజేపీ కకావికలం అవుతోంది. ఇపుడు సాధారణ బిల్లుల కోసం కూడా బీజేపీ మళ్లీ వైసీపీ వైపు చూడాల్సి వస్తోంది అంటున్నారు. వైసీపీకి రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు.
అంటే జగన్ని బీజేపీ మళ్లీ ప్రసన్నం చేసుకోవాలన్న మాట. జగన్ అవసరం మాకు ఇక అక్టోబర్ నుంచి ఉండదు, ఏపీ రాజకీయాల్లో మేము క్రియాశీలంగా ఉంటామని ఇప్పటిదాకా బీజే నేతలు ఆఫ్ ది రికార్డు గా గట్టిగా చెప్పుకొచ్చారు.
మరో వైపు చంద్రబాబుకు ప్రత్యేక ట్రీట్మెంట్ ఇస్తూ ఆయనతో షేక్ హ్యాండ్ పాలిటిక్స్ ని కూడా నడుపుతున్నారు. మొత్తానికి మొత్తం స్టోరీని ఒక్క దెబ్బతో నితీష్ అడ్డం తిప్పేశాడు కమలనాధులు మధనపడుతున్నారు. దాంతో మళ్లీ జగనే దిక్కు అన్నట్లుగా రాజ్యసభలో సీన్ తయారైందిట.
ఇక్కడ ఒక విషయం. బీజేపీ రాజకీయ, ఆ పార్టీ అధికార చపలచిత్తాన్ని గమనించాక అయినా వైసీపీ అధినాయకత్వం జాగ్రత్త పడాలని అంతా కోరుతున్నారు. భేషరతుగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసి జై మోడీ అన్న వైసీపీ ఇపుడు తనతో రాజకీయ అవసరం బాగా బీజేపీకి పడబోతున్న వేళ ఏపీకి న్యాయం చేయమని గట్టిగా డిమాండ్ చేయాలని అంతా కోరుతున్నారు. లేకపోతే మోడీతో లంచ్ చేశాం, అమిత్ షా తో గంట కబుర్లు చెప్పామని చెబితే బీజేపీ అదను చూసుకుని మళ్లీ రాజకీయ పావులు బయటకు తీస్తే విలవిలలాడం ఫ్యాన్ పార్టీదే అని అంటున్నారు.