Begin typing your search above and press return to search.
ఈసారి నితీష్ ప్రయత్నాలు మొదలుపెట్టారా ?
By: Tupaki Desk | 4 Sep 2022 2:30 PM GMTవచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు చేసేందుకు నాన్ ఎన్డీయే పార్టీలను కలిపే బాధ్యతను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మొదలుపెట్టారు. నాన్ ఎన్డీయే పార్టీలను ఏకతాటిపైకి తీసుకొస్తే బీజేపీని ఓడించటం పెద్దకష్టమేమీ కాదని నితీష్ చెప్పారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే బాధ్యతను జేడీయూ కార్యవర్గం నితీష్ కు అధికారమిస్తు తీర్మానం చేసింది. ఇందులో భాగంగానే ఈనెల 5-7 తేదీల మధ్య నితీష్ ఢిల్లీలో క్యాంపు వేయబోతున్నారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే నాన్ ఎన్డీయే పార్టీలన్నింటినీ కలిపే ఉద్దేశ్యంతో మొదటి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆమె ప్రయత్నాలు కొంత సక్సెస్ అయినా మెజారిటి ఫెయిలయ్యింది. బీజేపీ వ్యతిరేక కూటమికి తానే నాయకత్వం వహించాలని, ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఫోకస్ అవ్వటమే టార్గెట్ గా మమత పావులు కదపటంతో చాలాపార్టీలు ఆమె నాయకత్వాన్ని అంగీకరించలేదు.
తర్వాత కేసీయార్ కూడా ఒకప్రయత్నంచేసినా ఫెయిలయ్యారు. ఎందుకంటే కేసీయార్ కు అసలు క్రెడిబులిటీయే లేదు. ఏరోజు ఎవరితో పొత్తంటారో తెలీదు. ఎప్పుడు ఎవరిని అర్ధాంతరంగా వదిలేస్తారో తెలీదు. మమతతో కలవటానికి కూడా చాలాపార్టీలకు ఇదే సమస్య. అందుకనే ఈ ఇద్దరి ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మెజారిటి నేతలకు ఆమోదయోగ్యుడే కానీ ఆయనకు వయస్సయిపోయింది. పైగా ఆయనకు భాషా సమస్య కూడా ఉంది. మరాఠీ తప్ప మరే భాషా పెద్దగా రాదు.
ఈ నేపధ్యంలోనే ఇపుడు నితీష్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రతిపక్షాలన్నీ ఐకమత్యంగా పోరాటంచేస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీని 50 స్ధానాలకు పరిమితంచేయచ్చన్నది నితీష్ అంచనా. అయితే ఈ అంచనా వాస్తవం కాకపోవచ్చు కానీ నాన్ఎన్డీయే బలం పెరుగుతుందని మాత్రం చెప్పవచ్చు. ముందుగానే తాను ప్రధానమంత్రి పదవికి పోటీపడటంలేదని నితీష్ ప్రకటించేశారు కాబట్టి ప్రతిపక్షాలు నితీష్ తో హ్యాపీగా చర్చలు జరపవచ్చు. రాహుల్, కేజ్రీవాల్ లాంటి వాళ్ళతో నితీష్ చర్చలు జరపబోతున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.