Begin typing your search above and press return to search.

టాయిలెట్ నిర్మించకుంటే భార్యను అమ్మేసుకో!

By:  Tupaki Desk   |   24 July 2017 11:13 AM GMT
టాయిలెట్ నిర్మించకుంటే భార్యను అమ్మేసుకో!
X
స్వ‌చ్ఛ భార‌త్‌ కు మ‌ద్ద‌తుగా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌లిగించే క్ర‌మంలో దొర్లిన అప‌శృతిలో భాగంగా ఓ క‌లెక్ట‌ర్ వివాదంలో చిక్కుకున్నారు. త‌ను చెప్పాల‌నుకునే భావ‌న స‌రైన‌దే అయిన‌ప్ప‌టికీ వ్య‌క్తిక‌రించిన తీరు వివాదానికి దారితీసింది. బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా బీహార్‌ లోని ఔరాంగాబాద్ జిల్లా పరిధిలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కన్వల్ తనూజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ కామెంట్ల‌పై గ్రామ‌స్థులు మండిప‌డ్డారు. వివాదం ముదురుతుండ‌టంతో క‌లెక్ట‌ర్‌ వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది.

ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించుకునే వారికి బీహార్ ప్రభుత్వం రూ.12 వేల ఆర్థిక సాయం అందజేస్తోంది. ఇందులో భాగంగా జామ్‌ హ‌ర్ గ్రామ‌స్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు క‌లెక్ట‌ర్ వెళ్లారు. అక్క‌డ నిర్వ‌హించిన సభలో సొంతింటిలో మరుగుదొడ్డి నిర్మాణంతో కలిగే ప్రయోజనాలను కలెక్టర్ వివరిస్తుండగా, ఓ వ్యక్తి తన వద్ద డబ్బులు లేవని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన కలెక్టర్ అయితే వెళ్లి మీ ఇంటి గౌరవాన్ని (భార్యను) వేలం వేయండి అని వ్యాఖ్యానించారు. భార్య‌ల గౌర‌వం ప‌న్నెండు వేల రూపాయ‌ల కంటే త‌క్కువ అనుకుంటే మ‌రుగుదొడ్డి నిర్మించుకోవ‌ద్ద‌ని క‌లెక్ట‌ర్ క‌ల‌క‌లం రేకెత్తించే కామెంట్లు చేశారు. దీంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం మిగ‌తా వారి వంతు అయింది.

ఇంటిలో టాయిలెట్ నిర్మించుకోలేకపోతే భార్యను వేలంలో విక్రయించుకోవాలని ఓ పౌరుడితో అన‌డం ఏమిట‌ని గ్రామ‌స్థులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిపై అనంత‌రం క‌లెక్ట‌ర్ వివ‌ర‌ణ ఇస్తూ...త‌న ఉద్దేశం స‌రిగా అర్థం చేసుకోవాల‌ని కోరారు. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌ర్చాల‌నే భావ‌న త‌న‌కు లేద‌ని ఆయ‌న తెలిపారు.