Begin typing your search above and press return to search.

ఈ డిప్యూటీ సీఎంకి 44వేల పెళ్లి ప్రపోజల్సా?

By:  Tupaki Desk   |   21 Oct 2016 10:56 AM GMT
ఈ డిప్యూటీ సీఎంకి 44వేల పెళ్లి ప్రపోజల్సా?
X
సినిమా నటులకో, స్టార్ క్రికెటర్లకో అమ్మాయిల ఫాలోయింగ్ "ఆ" విషయంలో ఉందంటే అర్ధం చేసుకోవచ్చు. టాప్ మోస్ట్ మోడల్స్ కి మరికొంతమంది సెలబ్రెటీలకు ఆ స్థాయి ఫాలోయింగ్ ఉందంటే సరేలే అనుకోవచ్చు. కానీ ఒక రాజకీయ నాయకుడి విషయంలో కూడా అమ్మాయిలు పడి పడి పోతున్నారట. దానర్ధం రాజకీయ నాయకులు అందంగా ఉండరా అని కాదు కానీ... వారికి ప్రజలు చూసే దృష్టి వేరేగా ఉంటుంది. అయితే ఈ విషయంలో ఒక రాజకీయ నాయకుడికి అమ్మాయిల ఫాలోయింగ్ బీభత్సంగా ఉందని వెలుగులోకి వచ్చింది. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ నెంబర్ కు ఫిర్యాదు చేయమని ఒక నెంబర్ ఇస్తే... దానికి పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నాయట.

విషయంలోకి వస్తే... బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఇప్పుడక్కడ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనే చెప్పాలి. సాదారణంగా అతితక్కువలో తక్కువమంది రాజకీయ నాయకుల విషయంలోనే ఈ టాపిక్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే... ఎక్కడైనా రోడ్లు బాగోకపోతే ఫిర్యాదుచేయాలని ఆయన ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ కి రోడ్ల విషయంలో వచ్చిన ఫిర్యాదుల సంగతి పక్కనపెడితే, ఆయన్ను పెళ్లి చేసుకుంటామంటూ ఏకంగా 44వేల ప్రపోజల్స్ ఆ నెంబరుకు వాట్సప్‌ లో వచ్చాయట. ఈ స్థానిక విషయాన్ని అధికారులు చెబుతున్నారు. మొత్తం 44 వేల మందికి పైగా అమ్మాయిలు ఆయన "ఓకే" అంటే పెళ్లి చేసుకోడానికి సిద్ధమంటూ ప్రతిపాదనలు పంపారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే... ఈ నెంబరుకు మొత్తం 47వేల మెసేజిలు రాగా, వాటిలో 44వేలు ఈ పెళ్లి ప్రతిపాదనలే కావడం. అంటే... కేవలం 3వేల మెసేజ్ లు మాత్రమే రోడ్ల గురించి వచ్చాయి.

మరో విషయం ఏంటంటే... ఈ పెళ్లి ప్రపోజల్ మెసేజెస్ లో అమ్మాలు చాలా మంది తమ శరీర కొలతలు, రంగు, ఎత్తు లాంటి వివరాలను కూడా ఆ మెసేజిలలో ఇచ్చారట. గతంలో కొన్నాళ్ల పాటు క్రికెట్ ఆడి, అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన తేజస్వి యాదవ్ (26), ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ చిన్న కొడుకు. ఈ విషయంపై స్పందించిన ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్... "ఈ నెంబరు నా పర్సలన్ ఫోన్ నెంబరు అనుకుని పంపినట్లున్నారు.. ఇప్పటికి నేనింకా బ్రహ్మచారిని కాబట్టి సరిపోయింది గానీ, పెళ్లి అయి ఉంటే పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయి ఉండేవాడిని" అని సరదాగా అన్నారు. దీంతో తన పెళ్లికి సంబందించిన ప్రశ్నలపై స్పందించిన తేజస్వీ... పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటానని స్పష్టం చేశారు