Begin typing your search above and press return to search.
మోగిన బీహార్ ఎన్నికల నగరా
By: Tupaki Desk | 9 Sep 2015 9:45 AM GMTదేశ రాజకీయాల్ని మలుపు తిప్పే అవకాశం ఉందని భావిస్తున్న బీహార్ ఎన్నికలకు సంబంధించి నగరాను కేంద్ర ఎన్నికల సంఘం మోగించింది. బీహార్ అసెంబ్లీతో పాటు.. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పలు అసెంబ్లీ.. లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఉప ఎన్నికలకు తేదీలను ప్రకటించింది.
బీహార్ లోని 243 అసెంబ్లీ స్థానాల్ని ఐదు దశల్లోఎన్నికలను నిర్వహించనున్నారు. అక్టోబరు 12న తొలివిడత పోలింగ్ జరగనుంది. రెండో విడత పోలింగ్ అక్టోబరు 28న.. మూడో విడత నవంబరు 1.. నాలుగో విడత నవంబరు 5న పోలింగ్ జరగనుంది. ఇక.. ఓట్ల లెక్కింపును అక్టోబరు 8న చేపట్టనున్నారు. తాజాగా సీఈసీ చేసిన ప్రకటనతో బీహార్ లో ఎన్నికల కోడ్ మొదలైనట్లే.
మోడీ అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల ఫలితాలు మోడీ సర్కారు పనితీరుకు నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ.. జమ్మూకాశ్మీర్.. మహారాష్ట్ర.. తదితర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా.. ఒక పెద్ద రాష్ట్రంలో ఎన్నికలు బీహార్ కానుంది. బీహార్ ఎన్నికల్ని అధికార బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ప్రధాని మోడీ స్వయంగా.. బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం విదితమే.