Begin typing your search above and press return to search.
బీహార్ ఎగ్జిట్ పోల్స్: గెలుపు ఎవరిదంటే?
By: Tupaki Desk | 7 Nov 2020 5:34 PM GMTబీహార్ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే తేలిపోయింది. ఈసారి అధికార బీజేపీ-జేడీయూకు షాక్ తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనావేస్తున్నాయి. కరోనా కష్టకాలం బీజేపీ-జేడీయూ అధికారాన్ని కూల్చబోతోందని సర్వేలు తేల్చాయి. బీహార్ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తాయి. పలు జాతీయ మీడియా చానెల్స్ గెలుపు ఎవరిదనేది ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించాయి. ఈసారి అధికార బీజేపీ-జేడీయూ కూటమికి షాక్ తప్పదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిదే అధికారం అని తేల్చిచెప్పాయి.
బీహార్ లో ఆఖరు విడత పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ సర్వేలు విడుదలయ్యాయి. రిపబ్లిక్ టీవీ సర్వేలో ఆర్జేడీ కూటమికి 118-138 వస్తాయని తెలిపింది. ఇక జేడీయూ-బీజేపీకి 91-117 మాత్రమే వస్తాయని తెలిపింది. ఏబీపీ టీవీ : జేడీయూ 104-128, ఆర్జేడీ 108-131 వస్తాయని వివరించింది
ఇక టైమ్స్ నౌ జేడీయూకు 116, ఆర్జేడీకి 120 వస్తాయని తెలిపింది. జన్ కీ బాత్ జేడీయూకి 91-117, ఆర్జేడీకి 118-138 వస్తాయని వివరించింది.
పీపుల్స్ పల్స్-పీఎస్జీ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఆర్జేడీ సారథ్యంలోని మహాఘట్ బంధన్ వైపే బీహారీలు మొగ్గుచూపారని తేలింది. ఆర్జేడీకి 85-95 సీట్లు, కాంగ్రెస్ కు 15-20 సీట్లు, ఎల్జేపీకి 3-5 సీట్లు, వామపక్షాలకు 3-5 సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. అదే సమయంలో బీజేపీకి 65-75 సీట్లు దక్కుతాయని.. అధికార జేడీయూకి 25-35 సీట్లు మాత్రమే వస్తాయని సర్వే వెల్లడించింది. ఇండిపెండెంట్లు 5-13 గెలుస్తారని తెలిపింది.
జేడీయూ సీఎం నితీష్ పై ప్రజా వ్యతిరేకత బాగా వచ్చిందని.. అందుకే ఆర్జేడీ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయని సర్వే తేల్చింది. బీహార్ సీఎంగా ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ వైపు 36శాతం బీహారీలు ఓటు వేయగా.. నితీష్ వైపు 34శాతం మంది సపోర్ట్ చేశారు. ప్రధానంగా నిరుద్యోగం, ధరల పెరుగుదల, వలసలు, వరదలు, ఇతర సమస్యలు బీజేపీ కూటమి ఓటమికి దారితీశాయని తేలింది. ముస్లిం, యాదవులు,బీసీలు ఆర్జేడీ వైపు మొగ్గుచూపినట్టు సర్వేలో తేలింది.
ఈ ఎన్నికల్లో ఆర్జేడీ-కాంగ్రెస్-వామపక్షాలు కూటమిగా ఏర్పడి పోటీచేశాయి. బీజేపీ-జేడీయూ కలిసి సవాల్ చేశారు. ఈ రెండు కూటముల్లో స్వల్ప ఆధిక్యత ఆర్జేడీ కూటమిదేనని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.