Begin typing your search above and press return to search.
భర్తను చెట్టుకు కట్టి భార్య,కూతురుపై అత్యాచారం
By: Tupaki Desk | 15 Jun 2018 8:39 AM GMTబీహార్ లో దారుణం జరిగింది. మరోసారి ఆటవికం రాజ్యమేలింది. తాజాగా గయా జిల్లాలో ఓ వైద్యుడిని చెట్టుకు కట్టేసి అతడి భార్య, కూమార్తెలపై కొందరు మృగాళ్లు అత్యాచారం చేశారు. ఈ ఘటనతో గయా జిల్లాలో కలకలం రేగింది.
సోండియా జిల్లాలో ఓ వైద్యుడు తన విధులు ముగించుకొని తన భార్య, కుమార్తెలతో కలిసి మోటార్ సైకిల్ మీద ఇంటికి బయలు దేరాడు. జనసంచారం లేని ప్రాంతానికి వీరు చేరుకోగానే అక్కడ 20మంది దుండగులు వైద్యుడిని ఆపి మారణాయుధాలతో బెదిరించారు. వైద్యుడిని చెట్టుకు కట్టేసి ఆయన కళ్లముందే అతని భార్య, కుమార్తెలపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిని అక్కడే వదిలేసి పారిపోయారు.
అంతకుమందు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని దుండగులు బెదిరించినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటన జరిగిన రెండు గంటల్లోనే 20 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
20మంది అనుమానితుల్లో ఇద్దరిని మాత్రమే వైద్యుడు గుర్తించాడు. మిగతా 18 మంది ముసుగులు ధరించడంతో గుర్తించలేకపోయాడు. పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలో మోహరించి అనుమానుతులను ప్రశ్నిస్తున్నారు.
ఘటనపై ఆర్జేడీ నేత మాజీ మంత్రి తేజస్వీ యాదవ్ స్పందించారు. బీజేపీతో నితీష్ కుమార్ ప్రభుత్వం చేతులు కలిపాక బీహార్ లో శాంతి భద్రతలు గాడి తప్పాయని విమర్శించారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.