Begin typing your search above and press return to search.
ఇలాంటి ఐఏఎస్ లు కూడా ఉంటారు మరి!
By: Tupaki Desk | 16 July 2016 9:26 AM GMTబీహార్... గూండారాజ్ కు కేరాఫ్ అడ్రస్. అంతేనా అవినీతి అధికారులకు కూడా ఆ రాష్ట్రం చిరునామే. అందుకేనేమో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ యువ ఐఏఎస్ అధికారి తన ఫస్ట్ పోస్టింగ్ లోనే లంచావతారం ఎత్తాడు. ఆనక అడ్డంగా బుక్కయ్యాడు కూడా. తద్వారా అర్దరాత్రి అరెస్టు అయ్యాడు.
వివరాల్లోకి వెళితే, బీహార్ కు చెందిన యువకుడు జితేంద్ర గుప్తా 2013లో విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించి ఐఏఎస్ సర్వీస్ కు ఎంపికయ్యాడు. కఠోర శిక్షణ ముగించుకున్న అతడు బీహార్ కేడర్ నే ఎంపిక చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడిని బీహార్ సర్కారు మొహానియా - కైమూర్ సబ్ డివిజనల్ అధికారిగా నియమించింది. విధుల్లో చేరిన అయ్యగారి చేతులు మాత్రం ఖాళీగా ఉండేందుకు ససేమిరా అన్నాయి. రాత్రి రోడ్డెక్కిన ఆయన అటుగా వెళుతున్న నాలుగు లారీలను ఆపేశాడు. వాటిలో రెండు లారీలు ఓవర్ లోడుతో వెళుతున్నట్లు గుర్తించాడు. నడిరోడ్డుపైనే బేరసారాలకు దిగిన గుప్తా రూ.1.5 లక్షలు ఇస్తే కానీ లారీలను వదిలేది లేదని వాహనాల యజమానికి తేల్చి చెప్పాడు. ఆ తరువాత జరిగిన బేరసారాల్లో రూ. 1.5 లక్షల నుంచి అతడు రూ. 80 వేలకు తగ్గాడు. అందు కు ఒప్పుకున్న లారీ ఓనర్... గుప్తాకు సొమ్ము ముట్టజెప్పాడు. సొమ్ముతో పాటు లారీల పత్రాలు తీసుకుని గుప్తా అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. డబ్బుతో పాటు లారీ పత్రాలను తన అధికారిక నివాసంలోనే భద్రంగా దాచుకుని నిద్రకు ఉపక్రమించాడు.
ఇక లంచావతారం బారిన పడ్డ లారీ ఓనర్ ఆ తరువాత బీహార్ విజిలెన్స్ శాఖకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు గుప్తా నిద్రలో ఉండగానే ఆయన తలుపు తట్టారు. ఒళ్లు విరుచుకుని తలుపు తెరిచిన గుప్తా విజిలెన్స్ అధికారులను చూసి షాక్ తిన్నాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గుప్తాను తోసుకుంటూ లోపలికి వెళ్లిన విజిలెన్స్ అధికారులు లారీ ఓనర్ ఇచ్చిన డబ్బుతో పాటు లారీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే గుప్తాను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.