Begin typing your search above and press return to search.

ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తుపాకీలతోనా? బిహార్ లో కాదు.. అమెరికాలో?

By:  Tupaki Desk   |   5 Nov 2020 2:10 PM GMT
ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తుపాకీలతోనా? బిహార్ లో కాదు.. అమెరికాలో?
X
నిజమే.. చాలా ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. దేశంలో వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటిగా.. ఆరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా బిహార్ ను పలువురు అభివర్ణిస్తుంటారు. దీనికి భిన్నంగా.. ఎక్కడా పోలిక లేని రీతిలో అమెరికాలోనే అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకే సమయంలో.. ఆ మాటకు వస్తే.. ఒకే రోజున పోలింగ్ జరిగిన ఈ ఎన్నికల్ని చూసిన వారంతా అమెరికా కంటే బిహారే చాలా బెటర్ అన్న మాటలు వినిపించాయి.

ఈ వాదనకు మరింత బలం చేకూరేలా తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తాము అభిమానించే ట్రంప్ విజయానికి దూరం కావటాన్ని ఆయన పార్టీని అభిమానించే రిపబ్లికన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బైడెన్ గెలుపు ఇక లాంఛనమే అన్న వాదనను వారు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఓట్ల లెక్కింపును నిలిపివేయాలంటూ రిపబ్లికన్ల అభ్యర్థి కమ్ అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ట్రంప్ సుప్రీంను ఆశ్రయించటం తెలిసిందే.

ఆయనకు ఏ మాత్రం తీసిపోని రీతిలో రిపబ్లికన్ల సానుభూతిపరులు తాజాగా ఆయుధాలు చేతబట్టి.. మరికోపా కౌంటీ ఎలక్షన్ కేంద్రానికి రావటం సంచలనంగా మారింది. ఓట్ల లెక్కింపు కేంద్రానికి వచ్చిన 150 మందిలో చాలామంది వద్ద ఏఆర్ 150 రైఫిల్స్ ఉండటం.. ఇతరుల వద్ద వివిధ రకాలైన మారణాయుధాలు ఉండటం గమనార్హం. వారంతా బైడెన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎన్నికల్లో బైడెన్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేకపోవటం గమనార్హం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు కొద్ది రోజుల ముందు నుంచే వాల్ మార్ట్ లాంటి ప్రముఖ సూపర్ మార్కెట్లు తుపాకుల్ని అమ్మటాన్ని ఆపేయటం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిందే. ఇదంతా చూసినప్పుడు శాస్త్రసాంకేతికంగా.. ఎంతో ముందుండే అమెరికా కంటే వెనుకబడిన రాష్ట్రంగా చెప్పే బిహార్ చాలా బెటర్ అని చెప్పక తప్పదు కదూ?