Begin typing your search above and press return to search.
భార్య రెండో పెళ్లికి ఫోన్లో ఓకే చేసిన భర్త
By: Tupaki Desk | 4 Jan 2018 4:22 AM GMTవాళ్లిద్దరికి పెళ్లి అయ్యింది. వారి కాపురం సజావుగా సాగుతోంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాంటి వేళ.. మరో యువకుడ్ని పెళ్లి చేసుకుంటానని భార్య అంటే భర్త ఏమంటాడు? భార్య తీరుపై తన తల్లిదండ్రులు పోలీసు కేసు పెట్టిన నేపథ్యంలో.. ఏం జరుగుతుందన్న దానికి ఒక్కొక్కళ్లు ఒక్కోలా చెప్పొచ్చు. కానీ.. ఎవరూ ఊహించని వైనం బీహార్ లో చోటు చేసుకుంది. భార్య ఇష్టపడ్డ మరో వ్యక్తితో పెళ్లికి ఓకే అనేసిన వింత వైనమిది.
బీహార్ లోని వజీర్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం సంచలనంగా మారింది. తొమ్మిదేళ్ల క్రితం గఫ్తుర్ అలీకి తొమ్మిదేళ్ల క్రితం డల్లాపూర్ కు చెందిన ఒక యువతితో పెళ్లి అయ్యింది. వీరి రిలేషన్ సజావుగా సాగుతోంది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇదిలా ఉంటే.. రెండేళ్ల క్రితం ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లాడు అలీ. అదే సమయంలో గ్రామానికి చెందిన మరో యువకుడితో అలీ భార్యకు సాన్నిహిత్యం ఏర్పడింది.
వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం చోటు చేసుకుంది. దీంతో వారిద్దరూ కలిసి జీవించాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని భర్తకు.. ఇంట్లో వారికి చెప్పింది. కోడలి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో.. ఆమెను.. ఆ కుర్రడిని పోలీసులు స్టేషన్ కు పిలిపించారు. ఈ సందర్భంగా సదరు యువతి మాట్లాడుతూ.. తన రెండో పెళ్లికి తన భర్త అనుమతించినట్లుగా ఆమె పేర్కొన్నారు.
కన్ఫర్మేషన్ కోసం విదేశాల్లో ఉన్న భర్తకు ఫోన్ చేయటం.. అలీ ఓకే చెప్పిన వైనాన్ని చెప్పటంతో అవాక్కు కావటం పోలీసుల వంతైంది. ఈ వింత ఉదంతంలో ఇద్దరు పిల్లల్ని భర్త తల్లిదండ్రులకు అప్పజెప్పారు. భార్య రెండో పెళ్లికి భర్త ఫోన్లో అనుమతి ఇవ్వటంతో చేసేదేమీ లేక.. ఫిర్యాదు చేసిన వారికి నచ్చజెప్పి వారిని పంపారు. ఈ వ్యవహారం స్థానికంగా సంచలనంగా మారింది.