Begin typing your search above and press return to search.

పోర్న్ ఇండస్ట్రీకి భార్యను అమ్మేశాడు

By:  Tupaki Desk   |   17 Feb 2016 6:16 AM GMT
పోర్న్ ఇండస్ట్రీకి భార్యను అమ్మేశాడు
X
జీవితాంతం తోడు ఉంటానని చేతిలో చేయి వేసి.. అగ్నిసాక్షిగా వివాహం ఆడిన భార్య పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించాడో భర్త. పెళ్లి అయిన నెలన్నర కూడా నిండక ముందే ఆరాచకానికి తెర తీసిన ఇతగాడి ఉదంతం వింటే షాకింగ్ గా ఉంటుంది. పెళ్లి చేసుకొని రక్షకుడిగా ఉంటాననే మాటకు భిన్నంగా పోర్న్ సినిమాలు తీసే వారికి భార్యను అమ్మకానికి పెట్టిన దారుణ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. బీహార్ లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన నుంచి సదరు బాధితురాలు తృటిలో తప్పించుకుంది.

బీహార్ లోని సరాన్ జిల్లాకు చెందిన తరయా గ్రామానికి చెందిన డింపుల్ (పేరు మార్చటం జరిగింది) అదే రాష్ట్రానికి చెందిన టికు పాటికర్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. జనవరి 8న సంప్రదాయంగా పెళ్లి చేసి కాపురానికి పంపారు. కట్నం ఇవ్వలేదంటూ హింసకు గురి చేయటం షురూ చేశారు. ఈ నేపథ్యంలో తోడికోడల ద్వారా.. తనను పోర్న్ చిత్రాలు తీసే ముఠాకు రూ.7లక్షలకు అమ్మేశారని తెలుసుకున్న ఆమె అవాక్కైంది. తెల్లారితే.. సదరు ముఠా సభ్యులు వచ్చి తనను తీసుకెళతారని తెలుసుకున్న ఆమె.. భర్త ఇంటి నుంచి పారిపోయి.. పుట్టింటికి చేరుకొని.. తల్లిదండ్రులకు విషయం చెప్పి భోరుమంది.

దీంతో.. మండిపోయిన ఆమె పుట్టింటి వారు పోలీసుల్ని ఆశ్రయించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు చేయటం షురూ చేశారు.