Begin typing your search above and press return to search.
కృష్ణుని వేషం కట్టిన ఆరోగ్య శాఖా మంత్రి
By: Tupaki Desk | 1 Jan 2017 4:32 PM GMTఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన ప్రత్యేకమైన హావభావాలతో ఎలా ఆకట్టుకుంటారో తెలిసిందే. ఇపుడు అదే దారిలో లాలూ పెద్ద కుమారుడు - బీహార్ ఆరోగ్యశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ నడుస్తున్నట్లున్నారు. కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకొని తేజ్ ప్రతాప్ యాదవ్ కృష్ణుని అవతారమెత్తాడు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఆయన తన నివాసంలో ఇలా కృష్ణుని వేషం ధరించి అలరించారు. నెత్తికి రుమాలు చుట్టి నెమలి పించం అమర్చుకుని ఫ్లూట్ వాయిస్తూ ఫొటోకు పోజు పెట్టారు.
ఈ కొత్త గెటప్ పై తేజ్‌ప్రతాప్ యాదవ్ స్పందిస్తూ... బృందావన్ లోని ఓ భక్తుడు తనకు ఇవన్నీ వస్తువులు ఇచ్చినట్టు తెలిపారు. నూతన సంవత్సరం రోజున ధరించమని సలహా కూడా ఇచ్చాడని పేర్కొన్నారు. అందుకే తాను ఈ వేషం ధరించానని వివరించారు. ఇలా ధరించడం ఎవరి మనోభావాలను ఇబ్బందిపెట్టడం కాదని కూడా తేజ్ ప్రతాప్ యాదవ్ పేర్కొన్నారు.
ఇదిలాఉండగా తేజ్ ప్రతాప్ యాదవ్ శైలి భిన్నంగా ఉండటం ఇది కొత్తేం కాదు. గతంలో పబ్లిగ్గా ఓ జర్నలిస్ట్ తో గొడవకు దిగడం, అందులో లాలు జోక్యం చేసుకొని సర్దిచెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆర్జేడీ పార్టీ 20వ వార్షికోత్సవ కార్యక్రమం సందర్భంగా తన కుమారుడు తేజ్ ప్రతాప్ - తేజస్వితో కలిసి లాలూ యాదవ్ స్టేజ్ పై కూర్చున్నారు. ఈ సందర్భంగా తేజ్ ప్రతాప్ ఓ జర్నలిస్ట్ కెమెరా తీసుకొని దానిని పరిశీలించి ఫొటోలు తీయడం ప్రారంభించారు. దాన్ని మరో జర్నలిస్ట్ తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఇదే తేజ్ ప్రతాప్ కు కోపం తెప్పించింది. ఆ జర్నలిస్ట్ ను స్టేజ్ మీదికి పిలిచి ఆ వీడియో డిలిట్ చేయాలని ఆదేశించారు. నీ మీద కేసు వేస్తానంటూ తేజ్ ప్రతాప్ ఆ జర్నలిస్ట్ ను పలుమార్లు హెచ్చరించారు. ఇంతలో లాలూ యాదవ్ కల్పించుకొని తన కొడుకొని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. అయిందేదో అయిందంటూ నచ్చజెప్పాలని చూశారు. అయతే జర్నలిస్టులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో లాలూ ఇలాంటివి మనసులో పెట్టుకోవద్దని సూచించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/