Begin typing your search above and press return to search.
ఎంపీ పిల్లలని చూడకుండా కొట్టేశారు
By: Tupaki Desk | 7 April 2015 8:33 AM GMTఅధికారదర్పం చూపించాలనుకున్నారో ఏమో కానీ.. బీహార్‌కు చెందిన ఎంపీ కొడుకును.. మేనల్లుడ్ని ఢిల్లీలోని కొందరు కొట్టేశారు. పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం తీవ్రస్థాయికి చేరుకోవటం.. వైరి వర్గం వారు విరుచుకుపడటంతో ఎంపీగారి పుత్రరత్నానికి.. మేనల్లుడికి దెబ్బలు తగిలాయి.
బీహార్‌లోని జహనాబాద్ ఎంపీ అరుణ్‌కుమార్ కుమారుడు ఇరవైఏళ్ల రితురాజ్.. ఇరవై ఏళ్లు ఉండే మేనల్లుడు రిషాబ్‌లు తమ అధికార నివాసం నుంచి మరో ఇంటికి వెళ్లారు. అక్కడ తమ గేట్ ముందు కొందరు స్కూటీలు పార్క్ చేసి ఉండటం గమనించారు.
అయితే.. స్కూటీల మీద వచ్చిన వారు సైతం.. ఎంపీగారి బంధువులను చేసేందుకే ఆ ఇంటికి వచ్చారు. అయితే ఎంపీ కొడుకు.. మేనల్లుడు మాత్రం సదరు వాహనాల్ని గేటు ముందు నుంచి తీసేయాలని కోరటం.. అది కాస్తా గొడవకు దారి తీసింది. దీంతో స్కూటీకి చెందిన వ్యక్తులు ఎంపీ గారి పిల్లకాయల్ని పిడిగుద్దులు గుద్దేసి గాయపర్చారు. దీంతో న్యాయం కోసం వారు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు.