Begin typing your search above and press return to search.

సుప్రీం సంచలన నిర్ణయం.. బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్ కొట్టివేత..!

By:  Tupaki Desk   |   17 Dec 2022 10:50 AM GMT
సుప్రీం సంచలన నిర్ణయం.. బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్ కొట్టివేత..!
X
2002 ఏడాదిలో గుజరాత్ అలర్ల సమయంలో బిల్కిస్ బానోపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. గోద్రా అలర్ల సమయంలో బిల్కిస్ బానోపై 11 మంది వ్యక్తులు తన కుటుంబ సభ్యులను హత్య చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ 11మంది నిందితులను సీబీఐ స్పెషల్ కోర్టు 2008లో దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది.

ఈ కేసులో 14 ఏళ్ల జైలు జీవితం అనుభవించిన నిందితుల్లో ఒకరు తమను విడుదల చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు 1992 నాటి రెమిషన్ పాలసీని అమలు చేయాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం ఈ ఏడాది స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా జైలు జీవితం అనుభవిస్తున్న పలువురిని సత్ప్రవర్తన కింద విడుదల చేసింది.

జైలు నుంచి విడుదలైన వారిలో గోద్రా అల్లర్ల హత్య.. బిల్కిస్ బానోపై అత్యాచారం కేసులో శిక్షను అనుభవించిన 11 మంది నేరస్థులు విడుదలయ్యారు. వీరిని గుజరాత్ ప్రభుత్వం సత్ప్రవర్తన కింద విడుదల చేయడంపై ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలు తీవ్ర విమర్శలు చేశాయి. గుజరాత్ సర్కార్ రేపిస్టులకు.. హత్యలు చేసే వారికి అండగా ఉంటుందని ఆరోపణలు గుప్పించారు.

అయినా ప్రభుత్వం దోషులను విడుదల చేసేందుకు మొగ్గు చూపడంతో వారంతా 2022 ఆగస్టు 15న జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో దోషులుగా ఉన్న వారిని విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ బిల్కిస్ బానో ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును సుప్రీంకోర్టు తాజాగా విచారించింది.

బిల్కిస్ బానో సుప్రీం వేర్వేరుగా రెండు పిటిషన్లను దాఖలు చేసింది. తనపై హత్యాచారానికి పాల్పడిన వారిని.. తన కుటుంబ సభ్యులను హత్య చేసిన వారిని ప్రభుత్వం సత్ప్రవర్తన పేరుతో ఎలా విడుదల చేస్తుందని ప్రశ్నిస్తూ వేర్వేరుగా రెండు రివ్యూ పిటిషన్లను సుప్రీంలో దాఖలు చేసింది. అయితే ఈ రెండు పిటిషన్లను పరిశీలించిన సుప్రీంకోర్టు వాటిని తాజాగా కొట్టివేయడం సంచలనంగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.