Begin typing your search above and press return to search.

అమెరికా చ‌ట్ట‌స‌భ‌లో హెచ్‌1బీ బిల్లు..మ‌న‌కు దెబ్బే!

By:  Tupaki Desk   |   5 Jan 2017 11:12 AM GMT
అమెరికా చ‌ట్ట‌స‌భ‌లో హెచ్‌1బీ బిల్లు..మ‌న‌కు దెబ్బే!
X
అవ‌కాశాల‌కు వెతుక్కునే నైపుణ్య‌వంతుల‌కు పెట్ట‌ని కోట‌గా ఉన్న అమెరికా త‌న దోర‌ణిని మార్చుకుంటున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. అమెరిక‌న్ కాంగ్రెస్ ముందుకు మ‌రోసారి హెచ్‌1-బీ వీసా బిల్లు వ‌చ్చింది. ఈ వీసా నిబంధ‌న‌లకు కీల‌క మార్పులు సూచిస్తూ ఇద్ద‌రు చ‌ట్ట ప్ర‌తినిధులు బిల్లును తీసుకొచ్చారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా నైపుణ్యం క‌లిగిన ఉద్యోగులకు అమెరికాలో ప‌నిచేసే వీలు క‌ల్పించేవి ఈ హెచ్‌1-బీ వీసాలు. అయితే ఈ వీసాలు దుర్వినియోగం కాకూడ‌ద‌న్న ఉద్దేశంతో ఈ మార్పులు తీసుకొచ్చిన‌ట్లు ఆ చ‌ట్ట ప్ర‌తినిధులు తెలిపారు. మాస్ట‌ర్స్ డిగ్రీ మిన‌హాయింపు ఎత్తివేత‌ - ఏడాది క‌నీస జీతం ల‌క్ష డాల‌ర్ల‌కు పెంపులాంటి కీల‌క మార్పులు వీళ్లు సూచించారు. ఈ మార్పుల వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అత్యున్న‌త నైపుణ్యం క‌లిగిన వారికి మాత్ర‌మే అమెరికాలో కీల‌క ఉద్యోగాలు వ‌స్తాయ‌ని ఆ బిల్లు చెబుతోంది.

అమెరికా అగ్ర‌రాజ్యంగా కొన‌సాగాలంటే ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ నైపుణ్యం దేశంలోనే ఉండాలి. అయితే అదే స‌మ‌యంలో వీసా నిబంధ‌న‌ల‌ను దుర్వినియోగం చేస్తూ ఇక్క‌డి కంపెనీలు స్థానిక ఉద్యోగుల‌ను తొల‌గించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న చీప్ లేబ‌ర్‌ ను తెచ్చుకోవ‌డాన్ని కూడా అడ్డుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన ఇసా అనే చ‌ట్ట‌ప్ర‌తినిధి అభిప్రాయపడ్డారు. ఈ రెండింటికీ త‌మ బిల్లు న్యాయం చేస్తుంద‌ని చెప్పారు. మ‌న దేశంలో ఆ స్థాయి ఉద్యోగులు లేన‌ప్పుడు మాత్ర‌మే కంపెనీలు బ‌య‌టి వ్య‌క్తుల‌వైపు చూస్తాయి అని ఇసా అన్నారు. క‌నీస జీతం పెంచాల‌న్న నిబంధ‌న ఈ ప్ర‌ణాళిక‌లో భాగ‌మేన‌ని తెలిపారు. హెచ్‌1-బీ వీసా వ్య‌వ‌స్థ దుర్వినియోగాన్ని అడ్డుకోవ‌డం వ‌ల్ల అమెరికా ఉద్యోగాల‌కు ర‌క్ష‌ణ క‌ల‌గ‌డంతో పాటు కంపెనీలు పోటీ ప్ర‌పంచంలో నిల‌వ‌డానికి మాత్ర‌మే అత్యుత్త‌మ నైపుణ్యం క‌లిగిన ఉద్యోగుల‌ను నియ‌మించుకుంటార‌ని మ‌రో చ‌ట్ట‌ప్ర‌తినిధి స్కాట్ పీట‌ర్స్ అన్నారు. ఈ బిల్లుపై జ‌రిగే చ‌ర్చ‌ - ఓటింగ్ అమెరికా వెళ్లాల‌నుకునే భార‌తీయ ఐటీ ఉద్యోగుల భ‌విష్య‌త్‌ ను నిర్ణయిస్తాయ‌ని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/