Begin typing your search above and press return to search.
హిల్లరీ ఓటమికి కారణం చెప్పిన బిల్ క్లింటన్!
By: Tupaki Desk | 21 Dec 2016 4:41 AM GMTఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన అనంతరం ప్రతి ఒక్కరూ వారి వారి అపజాయాలపై రివ్యూలు వేసుకుంటూ ఉంటారు.. ఇది మంచి విషయం కూడా! ఇక గెలిచిన వారి సంగతి ప్రత్యేకంగా చెప్పేదేముంది.. సంబరాల్లో మునిగి తేలుతుంటారు, అంబరాన్నంటే సంబరాలకు అతిధులవుతుంటారు. ఇది గ్రామస్థాయి ఎన్నికల ఫలితాలైనా, అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయమైనా ఒకేలా ఉంటుంది. ఇలానే రివ్యూ చేసుకున్నారో ఏమో కానీ తాజాగా తన భార్య హిల్లరీ క్లింటన్ ఓటమికి సంబందించిన కారణాలపై స్పందించారు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్.
ఈమధ్య జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ గెలుపొందడం, ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం గెలుస్తారుకున్న హిల్లరీ ఓటమి పాలైన సంగతీ తెలిసిందే. అయితే ఇదే విషయంపై తనదైన శైలిలో స్పందించారు హిల్లరీ భర్త బిల్ క్లింటన్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఓటమికి "యాంగ్రీ వైట్‌మెన్" కారణమని పేర్కొన్నారు. న్యూయార్క్ లోని వీక్లీ న్యూస్ పేపర్ "రికార్డ్ రివ్యూ"తో మాట్లాడిన సందర్భంగా బిల్ క్లింటన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
డొనాల్డ్ ట్రంప్ కు పెద్దగా ఏమీ తెలియకపోయినా యాంగ్రీ వైట్ మెన్ ఓట్లు ఎలా గెలవాలో మాత్రం బాగా తెలుసు అని బిల్ క్లింటన్ వ్యాఖ్యానించారు. ఇక ఇది మాత్రమే కారణం కాకుండా... రష్యా హ్యాకింగ్ - ఎఫ్.బీ.ఐ డైరెక్టర్ జేమ్స్ కోమి సైతం హిల్లరీ ఓటమికి ప్రధాన కారణాలని బిల్ క్లింటన్ విశ్లేషించారు. ఈ విషయంపై మరింత క్లారిటీగా స్పందించిన ఆయన... ఎన్నికలకు రెండు వారాల ముందు హిల్లరీ ఈ మేయిల్స్ వ్యవహారంపై ఎఫ్. బీ.ఐ పునర్విచారణ అనడం ఖచ్చితంగా ఫలితాలపై ప్రభావం చూపిందని స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/