Begin typing your search above and press return to search.
హిల్లరీని బిల్ క్లింటన్ ఎంతగా పొగిడేశారంటే..
By: Tupaki Desk | 27 July 2016 9:58 AM GMTఅమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన భార్య - హిల్లరీ క్లింటన్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెళ్లడిస్తూ.. ఆమెను పొగడ్తలతో ముంచేశారు. ఆ విషయం నిజంగా ఆమెపై ఉన్న ప్రేమతోనూ - అభిమానులతో షేర్ చేసుకోవాల్సిన విషయంగానూ భావించి చెప్పారా లేక ఎన్నికల సమయంలో వారి ఇమేజ్ పెంచుకునే కార్యక్రమంలో భాగంగా చెప్పారా అనేది కాసేపు పక్కన పెడితే.. ఆసక్తిక్రమైన విషయాలే చెప్పుకొచ్చారు బిల్ క్లింటన్.
అమెరికా అధ్యక్ష రేసులో డెమొక్రాట్ల అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ అభ్యర్థిత్వాన్ని తాజాగా ఖరారు చేసిన సందర్భంగా జరిగిన పార్టీ జాతీయ సదస్సులో మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన భార్యను తెగపొడిగేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బిల్ క్లింటన్ వారి వ్యక్తిగత విషయాలను సైతం షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా బిల్ క్లింటన్ ప్రసంగం ఆయన మాటల్లోనే... "1971 వసంతకాలంలో నేను ఆమెను చూశాను.. అలా చూసిన క్షణంలోనే ఆమెతో ప్రేమలోపడ్డాను. ఆమె నా భార్యే కాదు బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఆమెకున్న తెలివితేటలు - బలమైన వ్యక్తిత్వం - ప్రేమ నన్ను ఇప్పటికి విస్మయానికి గురిచేస్తుంటుంది. నేను సంపూర్ణమైన జీవితాన్ని ఆమెతో ప్రేమలో పడిన తర్వాతే అనుభవించాను. ఒసామా బిన్ లాడెన్ ను గాలించటంలో బరాక్ ఒబామాకు హిల్లరీ ఎప్పుడూ అండగా నిలిచారు. ప్రజాసేవ గురించి నా కళ్లు తెరిపించి ఆదిశగా నన్ను ముందుకు నడిపించిది ఆమెనే" అని అనర్గలంగా భార్యపై పొగడ్తల వర్షం కురిపించారు బిల్ క్లింటన్!
ఈ సందర్భంగా తనదైన ఎన్నికల ప్రచారంలో దిగిన బిల్ క్లింటన్.. ఆఫ్రికన్ అమెరికన్లు స్వేచ్చగా బయట తిరిగేందుకు హిల్లరీకి అండగా నిలవాలని... దేశంలో మార్పు ఆమెతోనే సాధ్యం అవుతుందని చెప్పుకొచ్చారు. లోపాల్ని సరి చేసుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేయగల గొప్ప మహిళగా హిల్లరీని కీర్తించిన బిల్ క్లింటన్ పుట్టుకతోనే సమాజం పట్ల బాధ్యతను పెంచుకున్న పోరాటవేత్త తన భార్య అని చెప్పారు.