Begin typing your search above and press return to search.

ప్రపంచ కుబేరుడి అద్భుత నౌక..ధర ఎంతంటే!

By:  Tupaki Desk   |   10 Feb 2020 10:05 AM GMT
ప్రపంచ కుబేరుడి అద్భుత నౌక..ధర ఎంతంటే!
X
బిల్‌ గేట్స్.... మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు - ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్నుడు. అంత సంపన్నమైన వ్యక్తి వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇకపోతే బిల్‌ గేట్స్‌ తాజాగా ఓ అద్భతమైన షిప్ ను కొనుగోలు చేశారు. దాని ఖరీదు అక్షరాలా రూ.4600 కోట్లు. గత ఏడాది మొనాకోలో నిర్వహించిన యాట్ షో లో ఈ నౌక నమూనా చూసిన అయన.. దానిపై మనసు పారేసుకున్నారు. ఆ తరువాత అది పర్యావరణ హితమైనదని తెలిసి ఒక ఏమాత్రం ఆలోచించలేదు వెంటనే ఆ నౌక తయారీకి ఆర్డర్ ఇచ్చారు.

ఈ షిప్ పేరు ఆక్వా. కాగా.. ప్రపంచ కుబేరుల్లో రెండవ స్థానంలో ఉన్న బిల్ గేడ్స్ కు ఇప్పటి వరకూ సొంతగా విహార నౌక లేదు. తన కుటుంబంతో కలిసి షిప్ లో ఎప్పుడైనా విహరించాలనుకుంటే ప్రైవేట్‌ యాట్‌ లనే ఆయన ఇప్పటి వరకూ అద్దెకు తీసుకోని వెళ్లేవారు. కానీ..పర్యవరణ హితమైన ఈ షిప్ గురించి తెలిసిన ఆయన పర్యావరణంపై ప్రేమతోనే ఈ షిప్ ను కొనుగోలు చేసారు.

ఆక్వా ప్రత్యేకతలు :

370 అడుగుల పొడుగు ఉండే ఈ నౌక పేరు.. ఆక్వా. కళ్లు తిప్పుకోనివ్వని అందం - రాజసం ఈ ఆక్వా షిప్ సొంతం. ఈ షిప్ లో నాలుగు గెస్ట్‌ రూములు. రెండు వీఐపీ రూమ్స్..యజమాని బిల్ గేట్స్ సూట్‌ ఉంటాయి.

ఆక్వా వేగం గంటకు 17 నాటికల్ మైళ్లు.. దీంట్లో ఒక్కసారి ఇంధనాన్ని నింపితే 3750 మైళ్లు ప్రయాణిస్తుంది.

ఈ విలాసవంతమైన నౌకలో నుంచి బయటకు వెళ్లి విహారం చేయడానికి వీలుగా రెండు చిన్న బోట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ బోట్స్ ఒక్కోదాని పొడుగు 32 అడుగులు.

ఆక్వా నౌక నడవడానికి ఉపయోగించే ద్రవ హైడ్రోజన్‌ ను మైనస్‌ 253 డిగ్రీల ఉష్ణోగ్రతలో 2 ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. ఒక్కో ట్యాంకు సామర్థ్యం 28 టన్నులు. ఈ నౌక ప్రయాణించినప్పుడు కర్బన ఉద్గారాలూ వెలువడవు. నీళ్లు బయటకు వస్తాయంతే. దీంతో సముద్ర జలాలకు ఎటువంటి హానీ జరుగదు.

ఆక్వా నౌకలో సిబ్బంది సంఖ్య 31. వీరు ఈ నౌక లో ఉండే 14 మంది గెస్ట్ లకు సేవలు చేస్తుంటారు. వారికి ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లనుంచి అన్నింటినీ దగ్గరుండి చూసుకుంటారు. అలాగే ఈ ఆక్వాలో జిమ్‌ - యోగా చేసుకోవటానికి స్పెషల్ గా యోగా రూమ్‌ - మేకప్‌ రూమ్‌ - మసాజ్‌ పార్లర్‌ - స్విమ్మింగ్‌ పూల్‌ కూడా ఉన్నాయి.

ఇకపోతే , ప్రస్తుతం ఆక్వా షిప్ పూర్తిగా తయారవ్వలేదు. తయారీ దశలోనే ఉంది. 2024 నాటికి ఈ యాట్ బిల్‌ గేట్స్‌ చేతికి రానుంది. మొత్తంగా ఈ ఆక్వా ని చూస్తే బిల్ గేట్స్ షిప్పా మజాకా అన్నట్లుగా ఉంది. ఇలాంటి నౌక గతంలో ఇంకెవరికి లేదు. సైనస్ అనే డిజైనర్ దానికి ఒక రూపాన్ని ఇస్తే ..లేటరల్ నేవల్ ఆర్కి టెక్ష్ట్స్ అనే సంస్థ దాన్ని తయారుచేస్తుంది.