Begin typing your search above and press return to search.

ట్రంప్ నిర్ణయంపై బిల్ గేట్స్ అసహనం

By:  Tupaki Desk   |   15 April 2020 4:32 PM GMT
ట్రంప్ నిర్ణయంపై బిల్ గేట్స్ అసహనం
X
వెంటవెంటనే భావోద్వేగాలు మార్చే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిత్యం తన నిర్ణయాలు - అభిప్రాయాలతో ప్రపంచాన్ని షాక్ గురిచేస్తుంటాడు. కొంతకాలంగా ట్రంప్ డబ్లుహెచ్ వో పై చాలా కోపంగా ఉన్న విషయం తెలిసిందే. బహిరంగంగానే ఆ సంస్థపై విమర్శలు చేశాడు ట్రంప్. నిజానికి అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ కొంత పొరబడిన మాట వాస్తవమే గానీ... దానిపై ట్రంప్ ఏకంగా యుద్ధమే ప్రకటించడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా దానికి అమెరికా ఇస్తున్న నిధులు ఆపేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం ప్రపంచం వ్యాప్తంగా ఈరోజు వైరల్ అయ్యింది.

ట్రంప్ నిధుల నిలిపేయడాన్ని అంతర్జాతీయంగా పలువురు తప్పు పడుతున్నారు. ముఖ్యంగా... మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ దీనిపై అసహనం వ్యక్తంచేశారు. ప్రపంచానికిి డబ్లు హెచ్ వో సేవలు అత్యవసరం అని వ్యాఖ్యానించారు. దానికి నిధులు ఆపేడయం మంచిది కాదన్నారు. పైగా ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఇది ఏమాత్రం ఆమోదనీయ నిర్ణయం కాదని ఆయన అన్నారు. డబ్లుహెచ్ వో కరోనాపై ప్రస్తుతం గట్టిగా పోరాడుతోందన్నారు.

మరోవైపు ఉదయం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ట్రంప్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. కరోనాకు ఎపుడు చెక్ పడుతుందో తెలియని నేపథ్యంలో దానిపై కృషిచేస్తున్న అంతర్జాతీయ సంస్థకు ఈ సమయంలో నిధులు ఆపేయడం చాలా ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ఇది అందరూ కలిసి పోరాడాల్సిన సమయం. పాత విషయాలు తోడుకుని వేరు పడాల్సిన సందర్భం ఇది కాదు అన్నారు.

జర్మనీ కూడా ట్రంప్ నిర్ణయాన్ని ఆక్షేపించింది. కరోనాపై ఇతరులను నిందించవద్దని కోరింది. నేటి పరిస్థితిలో మంచి పెట్టుబడి ఏదైనా ఉందంటే... అది ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలను బలోపేతం చేయడమే. కోవిడ్‌-19పై పరిశోధనలు నిర్వహిస్తూ, వ్యాక్సీన్ల తయారీలో నిమగ్నమై అందరినీ ప్రోత్సహిస్తున్న అంతర్జాతీయ ఆరోగ్య సంస్థపై ట్రంప్ నిర్ణయం అభ్యంతకరమైనది అన్నారు. సాధారణ సమయాల కంటే ఎక్కువ నిధులు అవసరమైన ఈ సందర్భంలో ఆర్ధికంగా సతమతమవుతున్న డబ్ల్యూహెచ్‌ వోను ఆదుకోవాలి అని జర్మనీ అభిప్రాయపడింది.