Begin typing your search above and press return to search.
ప్రపంచ కుబేరుడి అల్లుడు ఇతడేనట!
By: Tupaki Desk | 31 Jan 2020 10:30 AM GMTప్రపంచ కుబేరుడిగా అందరికి సుపరిచితుడైన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. మిలిండా దంపతుల కుమార్తె జెన్నిఫర్ గేట్స్ తనకు కాబోయే భర్తను ప్రపంచానికి పరిచయం చేసింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరి ఎంగేజ్ మెంట్ తాజాగా పూర్తి అయ్యింది. తన కంటే ఆరేళ్లు పెద్దవాడైన నయెల్ నాసర్ ను ఆమె పెళ్లాడనున్నారు. తామిద్దరం కలిసి ఉన్న ఫోటోల్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయటంతో ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
మంచుకొండల్లో తన చెలికాడుతో దిగిన ఫోటోల్ని పోస్టు చేసిన జెన్నిఫర్ తన సంతోషాన్ని పంచుకుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ప్రేమను పంచుకుంటూ ముందుకు వెళతామని ఆమె పేర్కొన్నారు. ఆమె పెట్టిన పోస్టుకు ఇన్ స్టాలో వేలాది లైకులు వచ్చాయి. పలువురు నెటిజన్లు వారికి అభినందనలు తెలుపుతున్నారు. నాసర్ విషయానికి వస్తే అతడో గుర్రపు స్వారీ ఆటగాడు. అతడి తల్లిదండ్రులది ఈజిప్టు. అయితే.. వారు అమెరికాలో స్థిరపడ్డారు. నాసర్ కు ఈజిప్టు పౌరసత్వం ఉంది. ఈ కారణంగా 2020లో జరిగే ఒలింపిక్స్ లో ఈజిఫ్టు తరఫున అతను బరిలోకి దిగనున్నాడు.
తామిద్దరం ఉన్న ఫోటోల్ని జెన్నిఫర్ పోస్టు చేసిన తర్వాత నాసర్ కూడా రియాక్ట్ అయ్యారు. తమ నిశ్చితార్థానికి సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. ప్రపంచంలో తనంత లక్కీఫెలో ఎవరూ ఉండరేమో? అని పేర్కొన్నారు. చాలా సంతోషంగా ఉందంటూ తన ఆనందాన్ని తెలియజేశారు. తమ కుమార్తె పెట్టిన పోస్టుకు బిల్ గేట్స్ దంపతులు సైతం స్పందించారు. తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.