Begin typing your search above and press return to search.
మైక్రోసాఫ్ట్ నుంచి బిల్ గేట్స్ ఇందుకే వైదొలిగాడట
By: Tupaki Desk | 14 March 2020 7:30 PM GMTబిల్ గేట్స్.. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు పురుడు పోసిన అపర మేధావి. 26వ ఏటనే మైక్రోసాఫ్ట్ ను స్థాపించాడు. 1976 మార్చి 13న పబ్లిక్ కంపెనీగా అయిన మైక్రోసాఫ్ట్ లో డైరెక్టర్ బోర్డులో కొనసాగుతూ వచ్చాడు. సరిగ్గా అదే రోజున మార్చి 13 2020న మైక్రోసాఫ్ట్ నుంచి బిల్ గేట్స్ తప్పుకోవడం విశేషం.
తాజాగా తన కలల కంపెనీ మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలగడానికి గల కారణాలను బిల్ గేట్స్ లింక్డ్ ఇన్ సోషల్ మీడియా ఫ్టాట్ ఫామ్ లో పంచుకున్నాడు. తన శేష జీవితాన్ని గ్లోబల్ హెల్త్, అభివృద్ధి, విద్య వంటి రంగాలకు, ధార్మిక కార్యక్రమాలకు వెచ్చించేందుకే తాను మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. వాతావరణ మార్పులపై పెరుగుతున్న భూతాపం తగ్గించడం పై కృషి చేస్తానని బిల్ గేట్స్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. డైరెక్టర్ల బోర్డునుంచి వైదొలిగినంత మాత్రాన తాను మైక్రోసాఫ్ట్ సంస్థ నుంచి వైదొలగడం లేదని.. ఈ సంస్థతో తనకు జీవితకాల ప్రస్థానం ఉందని బిల్ గేట్స్ తెలిపారు.
ఇక తాను ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను నియంత్రించేందుకు అడుగులు వేస్తున్నట్టు బిల్ గేట్స్ తెలిపారు. కరోనా వైరస్ నివారణకు ప్రపంచ దేశాలు జరుపుతున్న పోరాటంలో తాము కూడా భాగస్వాములం అవుతామని బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా బిల్ గేట్స్ ప్రకటించారు. ఇందుకోసం 100 మిలియన్ డాలర్ల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ వ్యాధి నివారణకు పరిశోధనలు చేస్తున్న వారికి సహాయం చేస్తామని.. వాక్సీన్ తయారీకి అయ్యే ఖర్చును తాము విరాళంగా ఇచ్చిన మొత్తం నుంచి అందుకోవచ్చని బిల్ గేట్స్ ప్రకటించారు.
ఇక సీఈవో సత్యనాదెళ్లపై ప్రశంసలు కురిపించారు. సత్య హయాలో మైక్రోసాఫ్ట్ బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరిగిందన్నారు.
ఇక బిల్ గేట్స్ వైదొలిగినప్పటికీ ఆయనకు కంపెనీ లో 1.3శాతం వాటాలున్నాయి. సుమారు 16బిలియన్ డాలర్లు విలువైనవి.