Begin typing your search above and press return to search.
ప్రపంచ ధనికులు.. కొత్త జాబితా ఇదే..!
By: Tupaki Desk | 18 July 2019 5:11 AM GMTఒకప్పుడు ప్రపంచంలోనే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అత్యంత కుబేరుడు.. కానీ కొన్ని ఏళ్లుగా రెండోస్థానానికి ఆయన దిగజారారు. ఇప్పుడు మరింత పడిపోయాడు. తాజాగా బ్లూంబర్గ్ బిలియనీర్ సూచిక విడుదల చేశారు. ఈ మేరకు ప్రపంచ అత్యంత ధనికుల జాబితాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రపంచంలోని టాప్ 500 ధనికుల జాబితాను సంస్థ విడుదల చేసింది.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ నిలిచాడు. రెండోస్థానంలో ఉన్న బిల్ గేట్స్ మూడో స్థానానికి పడిపోయాడు. బిల్ గేట్స్ ను ను వెనక్కినెట్టి రెండో స్థానాన్ని బెర్నార్డ్ అర్నాల్ట్ దక్కించుకున్నాడు. ఎల్వీఎంహెచ్ మోయెట్ హెన్నెస్పీ - లూయిస్ విటన్ ఎస్ ఈ - ఏకేఏ ఎల్వీఎంఎహెచ్ సంస్థకు చైర్మన్ - సీఈవోగా ఉన్నారు. అర్నాల్ట్ ఆదాయం 108 బిలియన్ డాలర్లుగా పేర్కొంది.
2019లోరు అర్నాల్ట్ 39 బిలియన్ డాలర్లు సంపాదించినట్టు.. రెండోస్థానానికి ఎగబాకినట్టు బ్లూంబర్గ్ సంస్థ పేర్కొంది. మొదటి స్థానంలో ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ నికర ఆస్తుల విలువ 125 బిలియన్ డాలర్లుగా సంస్థ తెలిపింది. ఇక మూడో స్థానంలోని బిల్ గేట్స్ ఆస్తుల విలువ 107 బిలియన్ డాలర్లుగా తెలిపింది. ఈ ముగ్గురు ఆస్తులను కలిపితే ప్రపంచంలోనే ఎస్ అండ్ పీలో నమోదైన 500 లిస్టెడ్ కంపెనీల ఆస్తుల విలువతో సమానమని తెలిపింది. సామాజిక సేవకు బిల్ గేట్స్ పెద్ద మొత్తంలో సాయం చేయడం వల్లే ఆయన సంపద తగ్గిపోయిందని వివరించింది. ఇటీవల మిలిందా ఫౌండేషన్ కు 35 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు బిల్ గేట్స్. ఈ విరాళం ఇవ్వకపోతే రెండో స్థానంలోనే ఉండేవారు.
ఇక అమేజాన్ అధినేత జెఫ్ బెజోస్ విడాకులు ఇచ్చేసిన ాయన భార్య మెకెంజీ అత్యంత ధనిక మహిళల్లో నాలుగో స్థానంలో నిలిచారు. ఆమె ఆస్తుల విలువ 40.3 బిలియన్ డాలర్లు. ప్రపంచంలో 22వ స్థానంలో ఆమె నిలిచారు.
మన దేశానికి చెందిన ముకేష్ అంబానీ ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో 13వ స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ 51.8 బిలియన్ డాలర్లుగా బ్లూంబర్గ్ తెలిపింది. 20.5 బిలియన్ డాలర్లతో అజీమ్ ప్రేమ్ జీ 48వ స్థానంలో నిలిచారు.